Thota Chandrasekhar : ఏపీలో ఇది బీఆర్ఎస్ తొలి విజయం-తోట చంద్రశేఖర్
Thota Chandrasekhar : కేసీఆర్ ఆదేశాలతో కేంద్రం మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించగలిగాం.

Thota Chandrasekhar
Thota Chandrasekhar : BRS దెబ్బకే ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్’ విషయంలో కేంద్రం దిగి వచ్చిందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఇది ఏపీలో BRS పార్టీ తొలి విజయంగా అభివర్ణించారు. ఏపీలోని పార్టీలు చేయలేని కేసీఆర్ చేశారని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి లేఖ రాయడంతో పాటు ఒక అధ్యయన బృందాన్ని కేటీఆర్ పంపారని చెప్పారు.
ఏపీలో టీడీపీ, వైసీపీ చేతులు ఎత్తేస్తే.. AP ప్రజలకి అండగా నిలబడ్డది BRS పార్టీనే అని ఆయన అన్నారు. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంటును సాధించుకుందాం అని తోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఉక్కు ఉద్యమంలో 32మంది అసువులు బాసారని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఏపీ పార్టీలు ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా కేసీఆర్ మాత్రం పోరాటం చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పై లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారని తోట చంద్రశేఖర్ చెప్పారు.(Thota Chandrasekhar)
‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ రూ.3 లక్షల కోట్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5లక్షల మంది జీవిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేసీఆర్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఎగిరిపోతాయి.
జాతి సంపదను కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒకవేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం మొండి వైఖరితో ప్రైవేటీకరణ చేసినా.. మళ్ళీ దాన్ని కాపాడుకొని, జాతీయo చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల 3 రోజుల పాటు విశాఖలో పర్యటించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరుపున పోరాటం చేశాం. వారికి అండగా నిలబడ్డాం.
RINL(Rashtriya Ispat Nigam Limited) Expression of interest ను ఆహ్వానించింది. BRS దెబ్బకే.. కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఇవాళ విశాఖపట్నం లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదు. బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని ప్రకటించారు. బైలడిల్లా గనులను విశాఖ స్టీల్ ప్లాంట్, బయ్యారంకు ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా తెలుగు ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. RINL విలువ రూ.3లక్షల కోట్లు అయితే వాళ్ళు చూపించింది రూ.397 కోట్లు మాత్రమే.
అదానీ ఇంకా స్టీల్ ప్లాంట్ పెట్టకముందే బైలడిల్లా గనులను అదానీకి కట్టబెట్టారు. బైలడిల్లా గనులను అదానీకి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెంటనే గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ఆదేశాలతో కేంద్రం మెడలు వంచి, ఇవాళ కేంద్రప్రభుత్వ ఉక్కు సహాయ మంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించగలిగాం. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్’ ను ప్రైవేటీకరించబోమని తెలుపుతూ వెంటనే కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.(Thota Chandrasekhar)
RINL కు సొంత గనులు కేటాయించాలి. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన 20వేల ఎకరాల భూములను రాష్ట్రపతి పేరు మీద పెట్టుకున్నారు. దాన్ని వెంటనే RINL మీద ట్రాన్స్ ఫర్ చేయాలి. RINLకు రూ.5వేల కోట్లు తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంతకాళ్ళ మీద నిలబడేలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ కు ఆర్థికసాయం, వైజాగ్ రైల్వే జోన్, వైజాగ్ మెట్రో, దుగరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ సహా విభన హామీలను నేటికీ నెరవేర్చలేదు” అని తోట చంద్రశేఖర్ అన్నారు.