Three killed : చేతబడి చేశారన్న నెపంతో గర్భిణీ సహా ముగ్గురి హత్య

క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం ముగ్గురిని బలి తీసుకుంది. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ యువకుడు సొంత బాబాయ్ కుటుంబంలోని ముగ్గురిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది.

Three killed : చేతబడి చేశారన్న నెపంతో గర్భిణీ సహా ముగ్గురి హత్య

Murder (1)

Updated On : July 20, 2022 / 7:28 PM IST

Three killed : ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం ముగ్గురిని బలి తీసుకుంది. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ యువకుడు సొంత బాబాయ్ కుటుంబంలోని ముగ్గురిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరు మండలం కొత్తపల్లికి చెందిన కుక్క మల్లికార్జున యాదవ్‌..బాబాయ్‌ తిరుమలయ్య తనపై క్షుద్ర పూజలు చేస్తూ తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని గత కొంతకాలంగా అనుమానిస్తున్నాడు. ఓ స్వామి చెప్పిన మాటలు నమ్మిన మల్లికార్జున.. బాబాయ్, ఆయన కుటుంబంపై ఈ నెల 12వ తేదీన రాళ్లతో దాడి చేశాడు.

Andhra Pradesh: చేతబడి నమ్మకం.. కన్నతల్లి, తమ్ముడు, చెల్లిని చంపిన కిరాతకుడు!

మల్లికార్జున చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన తిరుమలయ్య భార్య ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తిరుమలయ్యతోపాటు ఆయన కుమార్తె స్వప్న తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరుమలయ్య చనిపోగా, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9 రోజుల తర్వాత స్వప్న మృతి చెందారు. స్వప్న 6 నెలల గర్భవతి కావడం గమనార్హం.

సొంత బాబాయ్ కుటుంబాన్ని హతమార్చిన తర్వాత మల్లికార్జున యాదవ్‌ కనిపించకుండా పోయాడు. గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మల్లికార్జున కోసం పోలీసులు గాలిస్తున్నారు.