Gandham Pallam Raju : అమలాపురంలో మరోసారి విధ్వంసం.. పల్లం రాజు ఆఫీస్ కు నిప్పుపెట్టిన దుండగులు

అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Gandham Pallam Raju : అమలాపురంలో మరోసారి విధ్వంసం.. పల్లం రాజు ఆఫీస్ కు నిప్పుపెట్టిన దుండగులు

Set Fire To Gandham Pallam Raju Office

Updated On : September 1, 2023 / 9:38 PM IST

Set Fire To Gandham Pallam Raju Office : అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దుండగులు మరోసారి విధ్వంసం సృష్టించారు. గంధం పల్లం రాజు ఆఫీస్ కు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. అమలాపురం ఎర్రవంతెన వద్ద గంధం పల్లం రాజు ఆఫీస్ కి నలుగురు వ్యక్తులు నిప్పు అంటించారు. శుక్రవారం మధ్యాహ్నం ఈదరపల్లికి చెందిన రౌడీ షీటర్ ను కొంతమంది దుండగులు హత్య చేశారు.

పాత కక్ష్యల నేపథ్యంలోని హత్య జరిగినట్టు పోలీసులు అంచనా వేశారు. ఇవాళ సాయంత్రం నలుగురు వ్యక్తులు కర్చీపులు కట్టుకొని గంధం పల్లం రాజు ఆఫీసు నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Hyderabad Drug Case : హైదరాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. పోలీసు బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.