Tirupati RajyaLakshmi : వీడిన మిస్టరీ.. రాజ్యలక్ష్మిది సహజ మరణమే అంటున్న పోలీసులు

రాజ్యలక్ష్మి(Tirupati Rajyalakshmi) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు.

Tirupati RajyaLakshmi : వీడిన మిస్టరీ.. రాజ్యలక్ష్మిది సహజ మరణమే అంటున్న పోలీసులు

Tirupati Rajyalakshmi

Updated On : March 12, 2022 / 4:44 PM IST

Tirupati Rajyalakshmi : తల్లి చనిపోయిన విషయం కూడా తెలియని పదేళ్ల కొడుకు.. నాలుగు రోజులు ఆమె మృతదేహంతోనే ఉన్నాడు. తల్లి నిద్రపోతోందని భావించిన కుమారుడు ఆమెను లేపడం ఇష్టం లేక అలానే గడిపేశాడు. ఈ నాలుగు రోజులు ఆమెకు టాటా చెప్పి మరీ అలానే స్కూల్ కి వెళ్లి వచ్చాడు. ఇంటికి వచ్చాక తల్లి మృతదేహం పక్కనే పడుకునే వాడు. చివరికి ఇంట్లోంచి దుర్వాసన వస్తోందంటూ మేనమామకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుండెలు పిండే ఈ విషాద ఘటన తిరుపతి విద్యానగర్‌ కాలనీలో చోటు చేసుకుంది.(Tirupati Rajyalakshmi)

కాగా, రాజ్యలక్ష్మి ఎలా చనిపోయింది? అనే మిస్టరీ వీడింది. రాజ్యలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. రాజ్యలక్ష్మిది సహజ మరణంగా పోలీసులు భావిస్తున్నారు. దహన సంస్కారాల కోసం రాజ్యలక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామమైన చిత్తూరు సమీపంలోని మురకంబట్టు గ్రామానికి తరలించారు. రాజ్యలక్ష్మి కుమారుడు శ్యామ్ కిషోర్ ప్రస్తుతం మేనమామ దగ్గరే ఉంటున్నాడు.(Tirupati Rajyalakshmi)

విద్యానగర్ కాలనీకి చెందిన రాజ్యలక్ష్మి భర్తతో విభేదాల నేపథ్యంలో పదేళ్ల కుమారుడు శ్యామ్ కిషోర్‌తో కలిసి విడిగా ఉంటోంది. విద్యానగర్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో పెంట్ హౌస్‌లో కొడుకుతో ఉంటోంది. ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తూ కొడుకుని పోషించుకుంటోంది. కాగా, ఈ నెల 8న ఇంట్లో కిందపడి రాజ్యలక్ష్మి మృతి చెందింది.

Andhra pradesh: తల్లి చనిపోయిందని తెలియని పసివాడు..‘నిద్రపోమ్మా..నేను స్కూల్ కెళ్తున్నా’..అంటూ నాలుగు రోజులుగా

అయితే, తల్లి మరణించిన విషయాన్ని తెలుసుకోలేని కుమారుడు శ్యామ్.. అమ్మ నిద్రపోతోందని భావించాడు. ఆమెను నిద్రలేపడం ఇష్టం లేక నాలుగు రోజులుగా తనే రెడీ అయ్యి స్కూలుకి వెళ్లి వస్తున్నాడు. అమ్మకు టాటా చెప్పి మరీ స్కూల్ కి వెళ్లేవాడు. ఇంటికి వచ్చాక తల్లి మృతదేహం పక్కనే పడుకునేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను తింటూ ఈ నాలుగు రోజులు గడిపేశాడు.

అప్పటికీ అమ్మ చనిపోయిందన్న విషయాన్ని పసిగట్టని శ్యామ్.. ఈ ఉదయం ఇంట్లో దుర్వాసన వస్తోందంటూ తన మేనమామ దుర్గాప్రసాద్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయనొచ్చి చూడగా షాక్ తిన్నాడు. సోదరి మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కాగా, శ్యామ్ మానసిక స్థితి సరిగా లేదని దుర్గాప్రసాద్ తెలిపాడు.(Tirupati Rajyalakshmi)

నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారి పడడంతో రాజ్యలక్ష్మికి గాయాలయ్యాయి. కొంత నలతగా ఉండటంతో రెండు మూడు సార్లు వాంతులు చేసుకుంది. కాసేపు నిద్రిస్తానని, తనను లేపే ప్రయత్నం చేయద్దని ఆ తల్లి కుమారుడు శ్యామ్ కిషోర్ కి చెప్పింది. అమ్మ చెప్పడంతో ఆమె మాట తూచ తప్పకుండా పాటించాడు శ్యామ్ కిషోర్. అమ్మ నిద్రిస్తుందని భావించిన పదేళ్ల బాలుడు గత నాలుగు రోజులుగా యధావిధిగా స్కూల్ కి వెళ్తూ వస్తున్నాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్ధాలతో నాలుగు రోజులుగా కాలం గడిపాడు. భోజనం చేసేందుకు అమ్మను లేపినా లేవకపోవడంతో అమ్మ ఇంకా నిద్రిస్తుందని భావించాడు. తానే స్కూల్ కి రెడీ అయ్యి వెళ్తున్నాడు. స్కూల్ లో ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేసి ఇంట్లోని తినుబండారాలను తిని అమ్మ పక్కనే నిద్రించేవాడు.

అయితే అమ్మ ఎంతకూ లేవకపోవడం, ఇంట్లో దుర్వాసన వస్తోందని భావించిన బాలుడు మేనమామకు ఫోన్ చేశాడు. అమ్మ ఎలా ఉందని ఆరా తీసిన మేనమామకు, నాలుగు రోజులుగా అమ్మ నిద్రిస్తూనే ఉందని బాలుడు చెప్పడంతో అనుమానం వచ్చింది. రాజ్యలక్ష్మి ఇంటికి చేరుకున్న ఆమె అన్న, ఇంట్లోకి వెళ్లి చూసి షాకయ్యాడు. తన చెల్లి మృతి చెందిందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అమ్మకు ఏమైంది? ఎందుకిలా ఉంది? అని బాలుడు శ్యామ్ కిషోర్‌ను అడగ్గా.. నాలుగు రోజుల కిందట అమ్మకు వాంతులు అయ్యాయని చెప్పాడు. తనకు నిద్ర వస్తుందని, డిస్టర్బ్ చెయ్యొద్దని అమ్మ చెప్పిందని, తాను అలానే చేశానని బాలుడు చెప్పడంతో మేనమామ, పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు పిలిచినా అమ్మ పలకడం లేదని, నిద్రపోతుందని భావించి తానే రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తున్నానని తెలిపాడు.

నిద్రపోతున్న అమ్మను ఇబ్బంది పెట్టకూడదని తనే ఇంట్లో ఉన్న బిస్కెట్స్, పండ్లు తింటూ నాలుగు రోజులు గడిపినట్టు బాలుడు తెలిపాడు. అపార్ట్ మెంట్ వాళ్లు అమ్మ గురించి అడిగినా నిద్రపోతోందని చెప్పాడు. ఎంతో ఉత్సాహంగా శ్రద్ధగా తనే రెడీ అయి నాలుగు రోజులు స్కూల్ కు వెళ్లి వచ్చాడు కిషోర్. ఇంట్లోనే హోమ్ వర్క్ కూడా పూర్తి చేశాడు. శ్యామ్ కిషోర్ కు చిన్ననాటి నుంచి మానసిక సమస్య ఉందని కుటుంబీకులు తెలిపారు.

మృతురాలు రాజ్యలక్ష్మి పీహెచ్ డీ కూడా చేశారు. చివరిసారిగా తను లెక్చరర్ గా పనిచేస్తున్న ప్రైవేట్ కాలేజీలో ఈ నెల 8న మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు. అదే రోజు ఇంట్లోనే ఆమె మరణించారు. తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిందనే విషయం కూడా తెలియని కొడుకు.. నాలుగు రోజులు మృతదేహం పక్కనే ఉండటం అందరి హృదయాలను ద్రవింపజేసింది.