Corona Cases In AP : ఏపీలో 24 గంటల్లో 6 వేల 341 కరోనా కేసులు

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1247 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,36,348 పాజిటివ్ కేసులకు గాను 17,56,495 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Corona Cases In AP : ఏపీలో 24 గంటల్లో 6 వేల 341 కరోనా కేసులు

Corona Cases In Ap

Updated On : June 18, 2021 / 5:37 PM IST

Corona Cases In AP : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18న విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో గత 24 గంటల వ్యవధిలో 6 వేల 341 మందికి కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 57 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 67 వేల 629 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 224 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1247 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,36,348 పాజిటివ్ కేసులకు గాను 17,56,495 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే…

చిత్తూరులో 12 మంది, గుంటూరులో ఎనిమిది, తూర్పు గోదావరిలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగుర, కృష్ణాలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, అనంతపూర్ ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, , విశాఖపట్టణంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మరణించారు. కడప జిల్లాలో కరోనాతో ఒక్కరు కూడా మృతి చెందలేదు.

జిల్లాల వారీగా కేసులు :

అనంతపురం 316. చిత్తూరు 919. ఈస్ట్ గోదావరి 1247. గుంటూరు 353. వైఎస్ఆర్ కడప 378. కృష్ణా 461. కర్నూలు 266. నెల్లూరు 295. ప్రకాశం 453. శ్రీకాకుళం 372. విశాఖపట్టణం 299. విజయనగరం 191. వెస్ట్ గోదావరి 791. మొత్తం : 6,341