Dhavaleshwaram : గోదావరి ఉధృతి..ధవళేశ్వరం బ్యారేజ్‌పై రాకపోకలపై ఆంక్షలు
ఉభయగోదావరి జిల్లాలని కలిపే ధవళేశ్వరం బ్యారేజ్ పై ఫోర్ వీలర్స్ వాహనాలకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. కేవలం టూ విల్లర్స్‌ని మాత్రమే అనుమతి ఇస్తున్నారు.ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు...ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Dhavaleswaram
Dhavaleshwaram : ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఇన్ ఫ్లో అంతకంతకు పెరుగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున 17 లక్షల క్యూసెక్కులు ఉన్న ఇన్ ఫ్లో ప్రస్తుతం 19 లక్షలకు చేరుకుంది. ఈ ప్రవాహం 23 లక్షల క్యూసెక్కుల వరకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్టుగా సముద్రంలోకి వదులుతున్నారు. మరోవైపు ఇన్ ఫ్లో 23 లక్షలకు చేరితే ఆరు జిల్లాల్లోని 554 గ్రామాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉభయగోదావరి జిల్లాలని కలిపే ధవళేశ్వరం బ్యారేజ్ పై ఫోర్ వీలర్స్ వాహనాలకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. కేవలం టూ విల్లర్స్‌ని మాత్రమే అనుమతి ఇస్తున్నారు.ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు…ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు బ్యారేజ్‌కి వరద పోటు పెరగడంతో సందర్శకులు తాకిడి పెరిగింది. దీంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
CM Jagan : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రమాదకర స్థితిలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. వరద తీవ్రతకు అప్పర్ కాపర్ డ్యామ్ కొన్నిచోట్ల కుంగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు- అప్పర్ కాపర్ డ్యామ్‌ను పటిష్ట పరిచేందుకు ఇసుక బస్తాలు, రాళ్ళను తరలించారు. 30లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా అప్పర్ కాపర్ డ్యామ్ తట్టుకుంటుందని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వరద ఉధృతిని మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు.
గోదావరికి పోటెత్తిన వరదలు అల్లూరి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వరద ధాటికి కూనవరం పూర్తిగా జలమయమైంది. కూనవరం, టేకులబోరు ప్రాంతాలలో వరద నీరు దాదాపు ఐదడుగుల లోతుకు చేరడంతో ప్రజలంతా బిల్డింగ్‌లపైకి ఎక్కి ఉంటున్నారు. దాదాపు 30 కుటుంబాలు సాయం కోసం వేచి చూస్తున్నాయి.
Polavaram Villages : గోదావరి ఉధృతి..పోలవరం దగ్గర ముంపునకు గురైన పలు గ్రామాలు
కాకినాడ జిల్లాలోని నాలుగు లంక గ్రామాలు జలమయం కావడంతో .. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో గోదావరి నదీ పాయలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వరదనీరు డొక్కా సీతమ్మ వారధిని తాకుతూ ప్రవహిస్తోంది. లంకల గన్నవరం, నడిగాడి, పుచ్చలంక, జొన్నలంక, శివాలయంక, నాగులంక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి.