Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. పూర్తైన సర్వదర్శనం టోకెన్ల జారీ
అన్ని కేంద్రాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ పూర్తైంది. నిర్ణీత సమయాని కన్నా ముందుగా టోకెన్లు జారీ చేయడంతో భక్తులకు ఊరట లభించింది.

Tirumala Vaikuntha Ekadashi
Tirumala Vaikuntha Ekadashi : తిరుమలలో వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ పెరిగింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి జనవరి 1వరకు దాదాపు పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం జరుగనుంది. ఇందుకోసం రూ.300 దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విక్రయించింది. ఇప్పటివరకు 2 లక్షల 25 వేల టికెట్లను విక్రయించింది.
ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది. ఇందుకు కోసం తిరుమల, తిరుపతిలో దాదాపు పది కేంద్రాల్లో 94 కౌంటర్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 4 లక్షల 23 వేల 500 టోకెన్లు జారీ చేయనుంది. ఇక స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ లో ఒక టోకెన్ కేంద్రం ఏర్పాటు చేసింది. సర్వదర్శనం టోకెన్లు అర్ధరాత్రి నుంచి టీటీడీ జారీ చేస్తోంది. దీంతో భక్తులు భారీగా తరలివచ్చారు.
ఏకాదశి, ద్వాదశి టోకెన్లు జారీ పూర్తైంది. వైకుంఠ ఏకాదశి దర్శనం, ద్వాదశి దర్శనం టోకెన్ల జారీని టీటీడీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభించింది. నిర్ణీత సమయాని కన్నా ముందుగా టోకెన్లు జారీ చేయడంతో భక్తులకు ఊరట లభించింది. అన్ని కేంద్రాల్లో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ పూర్తైంది. డిసెంబర్ 23, 24వ తేదీ టోకెన్లు జారీ పూర్తి అయింది. ప్రస్తుతం 25వ తేదీకి సంబంధించిన టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.
CM Jagan : సీఎం జగన్ సంచలన నిర్ణయాలు.. మళ్లీ గెలిపిస్తాయా? రిస్క్‌లో పడేస్తాయా? ఏం జరగనుంది
సర్వదర్శనం టోకెన్ల కోసం నిన్నటి నుండే కేంద్రాల వద్ద భక్తులు నిరీక్షించారు. టోకెన్ల కోసం నిన్నటి నుండే కేంద్రాల వద్ద భక్తులు తిరుమల కొండపై భక్తులు క్యూ కట్టారు. గంటల తరబడి టోకెన్ల కోసం క్యూలైన్ లో నిరీక్షించారు. ఇక రేపటి నుంచి పది రోజులపాటు దర్శనం టోకెన్లు ఉన్న వారిని మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.