TTD Board Meeting : టీటీడీ పాలక మండలి కీలక సమావేశం.. 55 అంశాలపై చర్చ

తిరుమల అన్నమయ్య భవన్ లో శనివారం ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు పాలకమండలి సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం 55..

TTD Board Meeting : టీటీడీ పాలక మండలి కీలక సమావేశం.. 55 అంశాలపై చర్చ

Ttd Board Meeting

Updated On : December 10, 2021 / 7:59 PM IST

TTD Board Meeting : తిరుమల అన్నమయ్య భవన్ లో శనివారం ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు పాలకమండలి సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం 55 అంశాలపై ఇందులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీ మార్కెటింగ్ విభాగంలో కొనుగోళ్లకు సంబంధించి పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది.

SBI Services : నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్

తిరుమల, తిరుపతిలో పలు ఇంజనీరింగ్ పనులకు ఆమోదం పాలకమండలి ఆమోదం తెలుపనుంది. తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే జీ.ఎన్.సీ, ఏఎన్సీ, హెచ్ వీ సీ మొదటి, రెండు, మూడవ సత్రాల్లో 25 లీటర్ల గీజర్ల ఏర్పాటుకు బోర్డు అనుమతి ఇవ్వనుంది. ఇక తమిళనాడు ఉలందూరు పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణం పనులకు పాలకమండలి ఆమోదం తెలపనుంది.

Facebook Profile Trick : మీ FB ప్రొఫైల్ ఎవరు చూశారో ఇట్టే తెలుసుకోవచ్చు!..

తిరుమలలో రింగ్ రోడ్ లోని సందీప్ రెస్టారెంట్ ను ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థకు మూడేళ్ల లీజ్ పొడిగింపుపై పాలకమండలి ఆమోదం తెలుపనుంది. ఇక శ్రీవారి కళ్యాణ కట్టలో క్షురకులుగా పని చేసే శ్రీవారి సేవకుల వేతనాల పెంపుపైనా బోర్డులో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.