TTD sensational decision : పదవీ విరమణ చేసిన అర్చకులు తిరిగి విధుల్లోకి..టీటీడీ సంచలన నిర్ణయం

అర్చకులు రమణదీక్షితులు తిరుమల శ్రీవారి విధుల్లోకి తిరిగి రానున్నారు. ఈ మేరకు టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.

TTD sensational decision : పదవీ విరమణ చేసిన అర్చకులు తిరిగి విధుల్లోకి..టీటీడీ సంచలన నిర్ణయం

Ttd Has Issued Orders Reinstating Retired Priests

Updated On : April 3, 2021 / 11:47 AM IST

TTD  sensational decision : అర్చకులు రమణదీక్షితులు తిరుమల శ్రీవారి విధుల్లోకి తిరిగి రానున్నారు. ఈ మేరకు టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్‌ అయిన ప్రధాన అర్చకులతో పాటు ఇతర అర్చకులు తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలిచ్చింది.

హైకోర్టు తుది తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. టీటీడీ తాజా ఆదేశాలతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణ దీక్షితులు ఆలయ ప్రవేశం చేయనున్నారు. అర్చక మిరాశీ వ్యవస్థను కొనసాగించి తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని రమణ దీక్షితులతో పాటు ఇతర రిటైర్డ్ అర్చకులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.