ఈనెల 25 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం : టికెట్లు విడుదల చేసిన టీటీడీ

  • Published By: murthy ,Published On : December 11, 2020 / 01:40 PM IST
ఈనెల 25 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం : టికెట్లు విడుదల చేసిన టీటీడీ

Updated On : December 11, 2020 / 1:44 PM IST

TTD release vaikunta dwara darshanam tickets : డిసెంబర్ 25 ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం, డిసెంబర్ 11న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి టికెట్లు టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పించనున్నారు.

ఈనెల 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు. ప్రతి రోజు 20 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.



వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కువ‌మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం చేసుకోవాడానికి అనువుగా శ్రీవారి ఆల‌యంలోని వైకుంఠ ద్వారాన్ని ప‌ది రోజుల పాటు తెర‌చి ఉంచాల‌ని టీటీడీ నిర్ణయించింది.



దీంతో డిసెంబ‌ర్‌ 25న వైకుంఠ ఏకాద‌శి కావడంతో ఆరోజు నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భ‌క్తుల‌కు ద‌ర్శనభాగ్యం క‌ల్పిస్తారు.