East Godavari News: విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి తన ఇద్దరు పిల్లలకు విషం తాగింది తాను తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పి. గన్నవరం మండలం కందులపాలెంలో ఈ ఘటన జరిగింది.

Two Childrens And His Father Leave Their Lifes
East Godavari News: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి తన ఇద్దరు పిల్లలకు విషం తాగింది తాను తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పి. గన్నవరం మండలం కందులపాలెంలో ఈ ఘటన జరిగింది. విశ్వనాథం, ఆతడి కుమారుడు రేవంత్ (10) కూతురు జెస్సికా (8) గ్రామంలోని ఓ కొబ్బరితోటలో పురుగుల మందు సేవించారు. కొద్దీ సేపటికి వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. కాగా మార్గమధ్యంలోనే జస్సికా మృతి చెందగా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్వనాథం, కుమారుడు రేవంత్ మృతి చెందారు.
కాగా గత రెండేళ్లుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే భార్య కాపురానికి రాకపోవడంతో విశ్వనాథం పిల్లలకు విషమిచ్చి తాను సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తుంది. ఈ ఘటనపై మలికిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజోలు సిఐ దుర్గా శేఖర్ రెడ్డి తెలిపారు.