నాటుసారా అనుకుని శానిటైజర్ తాగారు, పరిస్థితి విషమం, అనంతలో దారుణం

drink sanitizer: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నాటుసారా అనుకుని ఇద్దరు వ్యక్తులు శానిటైజర్ తాగేశారు. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
https://10tv.in/the-brother-who-killed-his-younger-brother-for-using-cell-phone-data/
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. నాటుసారా అని శానిటైజర్ విక్రయించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.