UP Actress Archana Gautham : తిరుమలలో యూపీ నటి అర్చన గౌతమ్ హల్‌చల్..వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని డిమాండ్
తిరుమలలో యూపీ నటి అర్చన గౌతమ్ హల్‌చల్ చేశారు. టీటీడీ అధికారుల తీరుపై అర్చన గౌతమ్ ఫైర్ అయ్యారు. తాను తెచ్చిన సిఫార్సు లెటర్‌కు.. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని అర్చన కోరారు. అయితే.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు జారీ చేస్తామని సిబ్బంది చెప్పడంతో.. తనకు వీఐపీ బ్రేక్ దర్శనమే కావాలని అర్చన పట్టుబట్టారు.

UP actress Archana Gautham
UP Actress Archana Gautham : తిరుమలలో యూపీ నటి అర్చన గౌతమ్ హల్‌చల్ చేశారు. టీటీడీ అధికారుల తీరుపై అర్చన గౌతమ్ ఫైర్ అయ్యారు. తాను తెచ్చిన సిఫార్సు లెటర్‌కు.. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని అర్చన కోరారు. అయితే.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు జారీ చేస్తామని సిబ్బంది చెప్పడంతో.. తనకు వీఐపీ బ్రేక్ దర్శనమే కావాలని అర్చన పట్టుబట్టారు.
అయితే..రూ.10,500 చెల్లించి.. శ్రీవాణి ట్రస్ట్ వీఐపీ బ్రేక్ టికెట్లు తీసుకోవాలని అర్చనకు టీటీడీ సిబ్బంది సూచించారు. కానీ, తనకు సిఫార్సు లెటర్ మీదే వీఐపీ బ్రేక్ దర్శనం కాల్పించాలని.. టీటీడీ జేఈవో ఆఫీస్‌లో అర్చన నానా హంగామా సృష్టించారు. టీటీడీ సిబ్బంది తనపై దుసురుగా ప్రవర్తించారని.. దర్శనం టికెట్ కోసం పది వేలు డిమాండ్ చేశారంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
Tirumala Srivari Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలు
ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అర్చన గౌతమ్ కోరింది. టీటీడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు యూపీ నటి అర్చన గౌతమ్ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు.