Vangalapudi Anitha : రోజా తన గొయ్యి తనే తవ్వుకుంటోంది.. లోకేశ్, పవన్ సీన్లోకి దిగితే ఎలా ఉంటదో ఊహించుకోండి..

ఇలా అడ్డగోలుగా రోజా మాట్లాడటం వల్లనే గతంలో మాజీ మంత్రి బండారు విమర్శించారు. వెంటనే రోజా చెన్నైకు వెళ్లి బ్రతిమిలాడి పాత హీరోయిన్ల చేత వీడియోలు పెట్టించుకుందని వంగలపూడి అనిత విమర్శించారు.

Vangalapudi Anitha : రోజా తన గొయ్యి తనే తవ్వుకుంటోంది.. లోకేశ్, పవన్ సీన్లోకి దిగితే ఎలా ఉంటదో ఊహించుకోండి..

Vangalapudi Anitha

Updated On : October 25, 2023 / 2:14 PM IST

Bhuvaneshwari Bus Yatra: చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 150 మందికిపైగా రాష్ట్రవ్యాప్తంగా చనిపోయారు. వారి కుటుంబాలను కలిసి అండగా ఉంటామని భరోసా కల్పించేందుకు నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టారు. ఏ మహిళాకూడా దీనిని విమర్శించదు. కానీ, మంత్రి రోజా మాత్రం దేవుని సన్నిధి అనికూడా భావించకుండా భువనేశ్వరిని విమర్శించింది. తన అడ్డగోలు మాటలతో రోజా తన గొయ్యి తనే తవ్వుకుంటుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. బుధవారం నారావారిపల్లెలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రోజాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :  Komati Reddy Rajagopal Reddy : బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అమిత్ షాకు రుణపడి ఉంటానని వెల్లడి

రోజా టీడీపీలో ఉన్న సమయంలో భువనేశ్వరి కాళ్లకు నమస్కారాలు పెట్టి రెండు సార్లు టీడీపీ టికెట్ దక్కించుకుందని అనిత అన్నారు. ఇలా అడ్డగోలుగా రోజా మాట్లాడటం వల్లనే గతంలో మాజీ మంత్రి బండారు విమర్శించారు. వెంటనే రోజా చెన్నైకు వెళ్లి బ్రతిమిలాడి పాత హీరోయిన్ల చేత వీడియోలు పెట్టించుకుందని వంగలపూడి అనిత విమర్శించారు. నగరి నియోజకవర్గంలో ఎర్ర మట్టి తరలింపుపై కూడా సీబీఐ విచారణ జరిపించాలి. నగరిలో చికెన్ కొట్టు వ్యాపారుల దగ్గరకూడా చిల్లర తీసుకుంటోంది. నీ బెంజ్.. గంజి కథలు అన్నీ తెలుసు రోజా అంటూ అనిత హెచ్చరించారు.

Also Read : Nara Lokesh : నారా భువనేశ్వరి బస్సుయాత్ర ప్రారంభం.. లోకేశ్ భావోద్వేగ ట్వీట్

శ్రీవారి దర్శనం టికెట్లు రోజా అమ్ముకుంటోందని, చారిటబుల్ ట్రస్ట్ పేరిట మంత్రి రోజా చేతివాటం ట్రస్ట్ నడుపుతోందని అనిత ఆరోపించారు. ఇక లోకేశ్, పవన్ కల్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తేనే వైసీపీ నేతలు భయపడుతున్నారు. వారిద్దరూ సీన్ లోకి దిగితే ఎలా ఉంటుందో ఊహించకోండి అంటూ హెచ్చరించారు. తల్లి, చెల్లిలను రాజకీయంగా ఉపయోగించుకొని వదిలేసిన వ్యక్తి జగన్ అంటూ అనిత విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ.. రోజా ది డ్రైనేజీ మౌత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజాకు తన భర్తను గౌరవించడంకూడా రాదు.. అన్నం తినే మహిళలు ఇలా మాట్లాడరు అంటూ రోజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదమ్ములతో కలిసి రోజా నగరిని అనకొండలా మింగేస్తుందని విమర్శించారు.