Vangalapudi Anitha: చెప్పులు చూపిస్తూ.. టీడీపీ మహిళా నేతల ర్యాలీ.. చివరకు అతడి ఇంటికి వెళ్లి..

సజ్జనరావు రాతలు చూడండంటూ అతడి ఇంటి చుట్టుపక్కల మహిళలకు కూడా వాటిని చూపించారు.

Vangalapudi Anitha: చెప్పులు చూపిస్తూ.. టీడీపీ మహిళా నేతల ర్యాలీ.. చివరకు అతడి ఇంటికి వెళ్లి..

Vangalapudi Anitha

Updated On : July 17, 2023 / 4:21 PM IST

Vangalapudi Anitha – TDP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నందిగామ(Nandigama )లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడంటూ కె.సజ్జనరావు అనే వ్యక్తి ఇంటిని టీడీపీ మహిళా నేతలు వంగలపూడి అనిత, తంగిరాల సౌమ్య నేతృత్వంలో తెలుగు మహిళలు చుట్టుముట్టారు.

వంగలపూడి అనితపై ఎందుకు అసభ్య పోస్టులు పెడుతున్నారని నిలదీశారు. వైపీసీ నేతలే సజ్జనరావుతో పోస్టులు పెట్టస్తున్నారని అన్నారు. సజ్జనరావు ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య, తల్లికి అనిత, సౌమ్య పోస్టులు చూపించారు. ఇలా అసభ్య పోస్టులు పెడుతుంటే సాటి మహిళలుగా ఎలా ఊరుకుంటున్నారని నిలదీశారు.

సజ్జనరావు రాతలు చూడండంటూ ఇంటి చుట్టుపక్కల మహిళలకు కూడా వాటిని చూపించారు. సజ్జనరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సజ్జనరావుకు ఫోన్ చేసి ఇంటి వద్దకు రావాలని అనిత డిమాండ్ చేశారు. అది వేరే వ్యక్తి రాసిన పోస్టు అని, దానితో తనకు సంబంధం లేదని సజ్జనరావు చెప్పారు. ఎవరు పోస్టు చేశారో అతడిని తమ వద్దకు తీసుకురావాలంటూ నిరసన కొనసాగించారు.సజ్జనరావు ఇంటి ముందు అతని ఫోటోలను తగలపెట్టారు.

అంతకుముందు వైసీపీ నాయకులు మహిళల జోలికొస్తే తాము ఊరుకోబోమని చెప్పులు చూపిస్తూ ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోనూ నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలను రక్షించాలని మొక్కుతూ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టారు.

Pawan Kalyan: సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేశాను.. అయితే..: పవన్ కల్యాణ్