అర్ధరాత్రి రోడ్‌పై వాహనాలు నిలిపి బర్త్‌ డే వేడుకలు.. అభ్యంతరం తెలిపిన వారిపై కత్తులు, రాడ్లతో దాడి

చిత్తూరు జిల్లా మదనపల్లె రామారావు కాలనీలో అరాచకం జరిగింది. అర్ధరాత్రి రోడ్‌పై అడ్డంగా వాహనాలు నిలిపి కొందరు యువకులు బర్త్‌ డే వేడుకలు జరుపుకున్నారు.

అర్ధరాత్రి రోడ్‌పై వాహనాలు నిలిపి బర్త్‌ డే వేడుకలు.. అభ్యంతరం తెలిపిన వారిపై కత్తులు, రాడ్లతో దాడి

Vehicles Parked On The Road At Midnight Birthday Celebrations

Updated On : March 12, 2021 / 1:17 PM IST

Birthday celebrations on the road : చిత్తూరు జిల్లా మదనపల్లె రామారావు కాలనీలో అరాచకం జరిగింది. అర్ధరాత్రి రోడ్‌పై అడ్డంగా వాహనాలు నిలిపి కొందరు యువకులు బర్త్‌ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలపై మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కత్తులు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.