Buddha Venkanna: వివేకా కేసులో విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలి.. వివేకా అల్లుడు, కూతురుకి కేంద్రం భద్రత కల్పించాలి

జగన్ చేతిలో గనుక సీబీఐ ఉంటే వివేకా అల్లుడు, కూతుర్ని ముద్దాయిలను‌చేసి జైల్లో వేయించేవాడని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివేకా అల్లుడు, కుమార్తెకు కేంద్రం భద్రత కల్పించాలని కోరారు.

Buddha Venkanna: వివేకా కేసులో విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలి.. వివేకా అల్లుడు, కూతురుకి కేంద్రం భద్రత కల్పించాలి

Buddha Venkanna

Updated On : March 12, 2023 / 1:09 PM IST

Buddha Venkanna: వివేకానంద రెడ్డి హత్యకేసు విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం వల్ల 2019లో టీడీపీ ఓడిపోయిందని, ఇప్పుడు అసలు విషయాలు బయటకు వస్తున్నాయని, 2024లో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరిస్తూ ఎన్నికలకు వెళ్తామని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఆనాడు గుండెపోటు‌తో వివేకానందరెడ్డి చనిపోయారని ప్రచారం చేసిన విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని అన్నారు. వివేకా హత్యకు సూత్రధారి అవినాష్ రెడ్డి అని సీబీఐ తేల్చడంతో జగన్ కి ముచ్చెమటలు పడుతున్నాయని, జగన్‌కు ధైర్యం ఉంటే అవినాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

TDP leader Buddha Venkanna: సీబీఐ వాళ్లు నాలుగు తగిలిస్తే అసలు విషయాలు బయటకొస్తాయి.. కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ద వెంకన్న సంచలన వ్యాఖ్యలు

జగన్ చేతిలో గనుక సీబీఐ ఉంటే వివేకా అల్లుడు, కూతుర్ని ముద్దాయిలను‌చేసి జైల్లో వేయించేవాడని బుద్దా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేసు విచారణలో అవినాష్ రెడ్డితో పాటు పలువురికి ఉచ్చుబిగుస్తుందని అన్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వివేకానంద అల్లుడు, కూతురుకి కేంద్రం భద్రత కల్పించాలి బుద్ధ వెంకన్న కోరారు. చనిపోయిన వివేక వ్యక్తిత్వాన్ని కించిపరిచేలా మాట్లాడుతున్నారని, వైయస్ కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చి వివేక హత్యపై మాట్లాడాలని అన్నారు. 2024లో వైసీపీ ఓడిపోతే ఏపీపై అణుబాంబు వేసేంత ఘనులు జగన్ వెంట ఉన్నారని ఆరోపించిన బుద్దా.. 2024లో వివేకా హత్య ఎజెండాతో మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.