Vijayawada : బాలిక ఆత్మహత్య కేసులో కేశినేని నాని ముఖ్య అనుచరుడు వినోద్ జైన్..!
50 ఏళ్ల వయసున్న వినోద్ జైన్ బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించాడన్నారు. పాపకు న్యాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించడమే కాకుండా..

Tdp Vinod
Vijayawada Girl Case : విజయవాడ బాలిక ఆత్మహత్య కేసుల తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇందులో వినోద్ జైన్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతని లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని బాలిక కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు స్పందించారు. 2022, జనవరి 30వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మూడు పేజీల లేఖ రాసిందంటే ఆమె ఎంత వేదనకు గురైందో అర్ధం చేసుకోవచ్చనానరు. టీడీపీ పార్టీకి చెందిన కేశినేని నాని ముఖ్య అనుచరుడు వినోద్ అని, ఆయన తరపున చంద్రబాబు ప్రచారం చేశాడన్నారు.
Read More : Oil Spill: సముద్ర తీరంలో ఆయిల్ స్పిల్, విపత్తుగా ప్రకటించిన థాయిలాండ్
ఘటనపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇలాంటి వారిని ప్రోత్సాహిస్తున్నారని, టీడీపీ పార్టీ వాళ్ళే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే ఆయన మహిళల గురించి మాట్లాడుతుండడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ కార్యాలయం నుండి మహిళలకు వేధింపులు జరగకుండా ఉంటే చాలని, వినోద్ జైన్ ను టీడీపీ సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని.. కచ్చితంగా చంద్రబాబు ఘటనపై సమాధానం చెప్పాలని మరోసారి డిమాండ్ చేశారు. ఎంతో అరాచకంగా పాపని ఇబ్బంది పెట్టినట్టు కుటుంబ సభ్యులు చెప్పినట్లు తెలిపారు.
Read More : Jr NTR-Mahesh Babu : సర్కారు వారి పాట షర్ట్స్.. జూనియర్ ఎన్టీఆర్ జీన్స్..
పాప తాతయ్య రిటైర్డ్ ఎమ్మార్వో అయిన పాప తాతయ్య పిల్లల కోసం ఏలూరు నుంచి విజయవాడ వచ్చి స్థిరపడ్డాడన్నారు. అయితే.. 50 ఏళ్ల వయసున్న వినోద్ జైన్ బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించాడన్నారు. పాపకు న్యాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించడమే కాకుండా.. పోలీసు ఉన్నతాధికారులను సైతం పలు ఆదేశాలు జారీ చేశారన్నారు. పాప తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నట్లు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు.