విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న బంగారం,వెండి స్వాధీనం

విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న బంగారం,వెండి స్వాధీనం

Updated On : January 24, 2021 / 1:15 PM IST

విజయవాడలో ఆదివారం ఉదయం భారీగా బంగారం పట్టుబడింది. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని విజయవాడ పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.  ఆదివారం ఉదయం బందరు రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తండగా  ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 1.74 కిలోల బంగారం, 1.4 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   వీటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తలు సరైన ఆధారాలు చూపించలేక పోవటంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  నిందితులు మధ్యప్రదేశ్, రాజస్థాన్‎కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.