విశాఖను ఏఐ డేటా సెంటర్ల హబ్‌గా తీర్చిదిద్దడంలో మరో కీలక ముందడుగు
రైడెన్ కంపెనీ గూగుల్‌కు అనుబంధ సంస్థ. ఆ సంస్థకు వారం రోజుల క్రితం ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Global AI Data Center Hub: విశాఖను ఏఐ డేటా సెంటర్ గ్లోబల్ హబ్‌గా ఏర్పాటు చేయడంలో మరో కీలక ముందడుగు పడింది. రైడెన్ ఇన్ఫోటెక్‌కు విశాఖ, అనకాపల్లి జిల్లాలో కలిపి 480 ఎకరాల భూమి కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రైడెన్ రూ.87,520 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే విశాఖలో ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ డేటా సెంటర్, సిఫీ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. (Global AI Data Center Hub) విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రైడెన్‌తో కూడా సర్కారు వారం క్రితం ఎంవోయూ కుదుర్చుకుంది.
Also Read: Cyclone: తుపాన్ అలర్ట్.. ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్.. ప్రజలకు సూచనలు
రైడెన్ కంపెనీ గూగుల్‌కు అనుబంధ సంస్థ. ఆ సంస్థకు వారం రోజుల క్రితం ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. రైడెన్‌కు రూ.22,002 కోట్ల రాయితీలు దక్కనున్నాయి. రూ.87,520 కోట్ల ఎఫ్‌డీఐతో, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది.
దీంతో ఏపీ సర్కారు 480 ఎకరాలను ఆ సంస్థకు కేటాయించింది. ఈ భూముల విలువలో 25% రాయితీ ఇస్తారు. జీపీజీడబ్ల్యూ ఫైబర్ యాక్సెస్ కోసం ఖర్చు పెట్టేదాంట్లో ప్రభుత్వం 30% మొత్తాన్ని 20 సంవత్సరాల్లో చెల్లిస్తుంది. డేటా సెంటర్ నిర్మాణానికి రూ.2,245 కోట్ల జీఎస్టీకి మినహాయింపు కూడా ఇచ్చింది.