Nara Bhuvaneswari : ప్రజల డబ్బు మాకు అవసరమే లేదు, ఏం తప్పు చేశారని చంద్రబాబుని జైల్లో పెట్టారు?- నారా భువనేశ్వరి
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మే వ్యక్తి ఎన్టీఆర్ నీడలో నేను పెరిగా. Nara Bhuvaneswari

Nara Bhuvaneswari
Nara Bhuvaneswari – Chandrababu Arrest : ఏం తప్పు చేశారని చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ప్రజల డబ్బు తమకు అవసరం లేదన్నారామె. తాను ఒక కంపెనీ నడుపుతున్నామని భువనేశ్వరి చెప్పారు. తన తండ్రి ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడిచాను అని చెప్పారు భువనేశ్వరి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా జరిగిన సంఘీభావ దీక్షలో భువనేశ్వరి పాల్గొన్నారు.
”మీకు కూడా తెలుసు. మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరమే లేదు. నేను ఒక కంపెనీ నడుపుతున్నాను. అందులో నేను 2శాతం అమ్ముకున్నా 400 కోట్ల డబ్బు వస్తుంది. ప్రజలు సొమ్ము ఎలా వస్తుందో అలానే వెళ్లిపోతుంది. ఒక జీవితం నాశనం చేస్తుంది. చంద్రబాబును అనవసరంగా రెచ్చగొడుతున్నారు. సింహంలా గర్జించే ఆయనను మీరు జైల్లో పెట్టి ఉండొచ్చు. కానీ ఒకటి మరిచిపోతున్నారు. ఇక నుంచి ప్రజల కోసం మరింత కసిగా చంద్రబాబు పని చేస్తారు” అని నారా భువనేశ్వరి అన్నారు.
Also Read..YCP MLAs: జగన్ పెట్టిన టెస్ట్‌లో పాసయ్యేదెవరు, ఫెయిలయ్యేదెవరు?
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జగ్గంపేటలో టీడీపీ నాయకులు చేపట్టిన నిరసన దీక్షలో భువనేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అన్నారు. ప్రజల సొమ్ము కోసం ఆశపడే కుటుంబం తమది కాదని స్పష్టం చేశారు.
”చంద్రబాబు సింహంలా బయటకు వచ్చి మీ కోసం మళ్లీ పని చేస్తారు. అవినీతి మరక అంటించి 17 రోజులుగా జైల్లోనే ఉంచారు. ఏం తప్పు చేశారని చంద్రబాబుని జైల్లో నిర్బంధించారు? ప్రజల సొమ్ము ఆయనేమీ తీసుకోలేదు. మా కుటుంబానికి ప్రజల సొమ్ము అవసరమే లేదు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మే వ్యక్తి ఎన్టీఆర్ నీడలో నేను పెరిగా. నేను, నా కోడలు బ్రాహ్మణి ఏనాడూ బయటకు రాలేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నాం.
స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లబ్ది పొందిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. యువత జీవితాలు మార్చడమే చంద్రబాబు చేసిన తప్పా? అని” నారా భువనేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.