Road Accident: 4 రోజుల్లో పెళ్లి.. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా విషాదం

మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరగనుంది. బంధువులు, స్నేహితులకు పెళ్లి పత్రికలను పంచేందుకు వెళ్తూ.. వరుడు రోడ్డు ప్రమాదంలో వీరుడు మృతి చెందాడు.

Road Accident: 4 రోజుల్లో పెళ్లి.. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా విషాదం

Road Accident

Updated On : August 23, 2021 / 1:19 PM IST

Road Accident: మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరగనుంది. బంధువులు, స్నేహితులకు పెళ్లి పత్రికలను పంచేందుకు వెళ్తూ.. వరుడు రోడ్డు ప్రమాదంలో వీరుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. ఈ నెల 27న కదిరి ఎర్రదొడ్డికి చెందిన మహేష్‌ (26)కు వివాహం జరగాల్సి ఉంది.

బంధువులకు వివాహ పత్రికలను పంచేందుకు మహేష్ స్వగ్రామం నుండి అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళాడు. కానీ, కొద్ది సమయానికే గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. నాలుగు రోజులలో పెళ్లి అనగా ఇలా విశదవార్త వినడంతో మహేష్ కుటుంబం తల్లడిల్లిపోతుంది. ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన మహేష్‌ నెల రోజుల కిందటే పెళ్లి కోసం సొంత ఊరికి రాగా.. పెళ్లి పనుల్లో ఉండగానే ఈ ప్రమాదం జరిగింది.

చిన్ననాటి నుండే స్వయంకృషితో ఎదిగిన మహేష్ త్వరలో కోడలితో కలిసి జంటగా వస్తాడనుకుంటే అందరిని వదిలేసి ఇలా వెళ్లిపోయాడంటూ కుటుంబీకులు, బంధువులు రోదన అందరినీ కలచివేస్తుంది. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించి పంచనామా నిర్వహిస్తున్నారు.