కరోనా క్వారంటైన్ రూంలు ఎలా ఉంటాయి? భోజనం సంగతేంటి? ఎలా ట్రీట్ చేస్తారు?

  • Published By: madhu ,Published On : March 29, 2020 / 09:56 AM IST
కరోనా క్వారంటైన్ రూంలు ఎలా ఉంటాయి? భోజనం సంగతేంటి? ఎలా ట్రీట్ చేస్తారు?

Updated On : March 29, 2020 / 9:56 AM IST

కరోనా రాకాసి బారిన పడిన వారిని ఎక్కడకు తీసుకెళుతారు ? 14 రోజుల పాటు ఎలాంటి చికిత్స అందిస్తారు ? చికిత్స చేయించే కేంద్రం ‘క్వారంటైన్’ అంటే ఏమిటీ ? ఇది ఎలా ఉంటుంది ? ఇలాంటి సందేహాలు ప్రస్తుతం అందరి మదిని తొలిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. వేల మందికి పాజిటివ్ లక్షణాలు కనిపించాయి.

21 మంది మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ వైరస్. కానీ..లక్షణాలు కనిపించిన వ్యక్తిని..వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నారు. క్వారంటైన్ కేంద్రంలో ఉంచి 14 రోజుల పాటు వైద్యం అందిస్తున్నారు. 

టీ, టిఫిన్, స్నాక్స్, భోజనం
ఏపీ రాష్ట్రంలో ఎన్నో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వారికి అధికార యంత్రాంగం సకల సదుపాయాలు కలిపిస్తోంది. ప్రతి వారిని విడివిడిగా ఉంచుతున్నారు. ప్రతి గదిలో బెడ్, డస్ట్ బిన్, వైఫై సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టిఫిన్, భోజనం, స్నాక్స్ అందిస్తున్నారు. ఏ ఆహార పదార్థాలు ఇస్తున్నారనేది మైక్ ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. గది ముందు పెట్టగానే వీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం టీ, రాగీ మాల్ట్, ఉడికించిన గుడ్డు, ఫ్రూట్ సలాడ్ (టిఫిన్), శాకాహార, మాంసహార భోజనం (లంచ్), టీ, స్నాక్స్ (సాయంత్రం), రైస్, వెజ్ కర్రీలు (డిన్నర్) కి అందచేస్తున్నారు. 

రెవెన్యూ అధికారులు భోజనం ఏర్పాట్లు చూస్తున్నారు. పంచాయతీ రాజ్ అధికారులు పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. 24 గంటల పాటు వైద్య సేవలందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక పోలీసులు క్వారంటైన్ చుట్టూ 24 గంటలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. 

* రాష్ట్రంలో 2020, మార్చి 28, శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 
* గుంటూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

* కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో శనివారం రాత్రి వరకు 19 కేసులు నమోదైట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త బులిటెన్ విడుదల చేసింది. 
* ఏపీ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్, వైరస్ వ్యాప్తి చెందుతుండడంపై సీఎం జగన్ ఆరా తీస్తున్నారు. 

* లాక్ డౌన్, తదితర విషయాలపై కఠినంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.