Perni Nani : ఆ మూడు పార్టీలు కలిసినా.. మరో 20ఏళ్లు జగన్‌ను ఏమీ చెయ్యలేవు- పేర్నినాని
Perni Nani - Pawan Kalyan

Perni Nani - Pawan Kalyan
Perni Nani – Pawan Kalyan : టీడీపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. జగన్ ప్రభుత్వంపై ఇక యుద్ధమే అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. పవన్ కల్యాణ్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మాజీమంత్రి పేర్నినాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ.. ఆ మూడు పార్టీలు కలిసినా.. మరో 20ఏళ్లు జగన్ ను ఏమీ చేయలేరు అని పేర్నినాని అన్నారు.
” పవన్ పరామర్శకు వెళ్ళారా. డీల్ మాట్లాడుకోవడానికి వెళ్ళారా? ఈరోజు జరిగింది ములాఖాత్ కాదు.. మిలాఖత్.. టీడీపీతో జనసేనత పొత్తు పర్మినెంట్ అని పవన్ క్లారిటీగా ఉన్నారు. బీజేపీ ఏమో పిల్లి మొగ్గలు వేస్తోంది. 2014లోనూ బీజేపీ పేరుపై టీడీపీ ప్రచారానికి పవన్ వెళ్లారు. జనసేనతో బీజేపీ పొత్తు తాత్కాలికమే. నిండు అమావాస్య రోజు పొత్తు ప్రకటన మంచి శుభ సూచకం.
Also Read..TDP Janasena Alliance: పూర్తిగా ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్.. తర్వాత ఏం జరగబోతోంది?
టీడీపీలో పవన్ అంతర్భాగం. ఇది అందరికీ తెలిసిన నిజం. చంద్రబాబు తత్వం వాడుకుని వదిలెయ్యడం అని పవన్ గతంలో అన్నారు. వాడుకుని వదిలేసే వాడితో పొత్తులో ఏం వ్యాపారం ఉంది..? అవినీతిపై పోరాటం అంటూ నీతి వ్యాఖ్యలు చెబుతూ అవినీతిపరుడితో కలిసి పోటీ అంటున్నారు. తమ్ముడు లోకేశ్ గురించి పవన్ మాట్లాడిన మాటలు మర్చిపోయారా? తమ్ముడు దోచేసిన దాంట్లో అన్నకు ఎంత వాటా ఇచ్చారు?
మూడు పార్టీలు కలిసినా 20ఏళ్లు జగన్ ను ఏమీ చెయ్యలేరు. బీజేపీ పొత్తులో ఉన్నావ్ కదా స్కిల్ స్కాం మొదట కనిపెట్టింది ఈడీ, జీఎస్టీ శాఖలే అని పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి” అని పేర్నినాని అన్నారు.
Also Read..Pawan Kalyan: జైల్లో చంద్రబాబు భద్రత విషయంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
”టీడీపీతో జనసేన పొత్తు వార్త పాతదే. ఇందులో కొత్తదనం లేదు. పవన్ టీడీపీలో అందర్భాగం అని.. కలవడం, విడిపోవడం ఇవన్నీ ముసుగు కార్యక్రమాలు అని ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం అని తెలిసి పొత్తు పెట్టుకోవడం వెనుక రహస్యం ఏంటి? జైలుకి వెళ్లి వ్యాపారం మాట్లాడుకుని వచ్చారా? ప్రజాధనం దోచుకున్న దొంగను పవన్ పరామర్శిస్తాడా?” అని ఫైర్ అయ్యారు పేర్ని నాని.