అసెంబ్లీలో వీడియోల ప్రదర్శన..శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది ఇదే – సీఎం జగన్

శివరామకృష్ణన్ కమిటీ ఎలాంటి అంశాలు చెప్పిందో ఏపీ ప్రభుత్వం వీడియో క్లిప్పింగ్స్ ద్వారా చూపెట్టింది. కమిటీ చెప్పిన విషయాలను బాబు తప్పుగా చెప్పారని తెలిపారు. అంతకంటే ముందు..సీఎం జగన్ ప్రసంగించే సమయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో 17 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు స్పీకర్ తమ్మినేని. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. ఏపీ చరిత్రను మరోసారి గుర్తు చేశారు. ఏపీ రాజధానిపై ఏర్పడిన శ్రీ కృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ ఏలాంటి అంశాలు చెప్పాయో వివరించారు. దీనికి సంబంధించిన వీడియోలను సభలో ప్రదర్శించారు.
సూపర్ కేపిటల్ వద్దు..అన్నపూర్ణ లాంటి ప్రాంతమైన ఇక్కడ రాజధాని వద్దు అని తెలిపింది. కమిటీ ఇచ్చిన నివేదికలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కమిటీ నివేదికలను పట్టించుకోకపోవడంతో శివరామకృష్ణన్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ పత్రికకు వ్యాసం రాశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత..గడ్డిపరకకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదు. వన్ సైడ్‌గా చేస్తూ వెళ్లిపోయారు బాబు’
సస్పెన్షన్ అయిన వారు
అచ్చెన్నాయుడు, కరణం బలరాం, నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చిన రాజప్ప, వెంకటిరెడ్డి నాయుడు, వాసుపల్లి గణేశ్, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, మంతెన రామరాజు, బాల వీరాంజనేయ స్వామి.
Read More : 3 రాజధానుల బిల్లు : సీఎం జగన్ చెప్పిన ఆంధ్రలు రాజధాని చరిత్ర