నిత్యావసర సరుకుల ధరకు మించి అమ్మితే జైలుకే

  • Published By: sreehari ,Published On : March 22, 2020 / 02:24 PM IST
నిత్యావసర సరుకుల ధరకు మించి అమ్మితే జైలుకే

Updated On : March 22, 2020 / 2:24 PM IST

నిత్యావసర ధరలను ప్రభుత్వమే ప్రకటిస్తుందని, ప్రభుత్వం ప్రకటించిన ధరలకు మించి అమ్మితే జైలుకు పంపుతామన్నారు. మార్చి 29వ తేదీ నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ బియ్యంతో పాటు కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 4న ప్రతీ తెల్ల రేషన్ కార్డుదారుని ఇంటికి వెళ్లి గ్రామ వాలంటీర్ రూ.1000 అందిస్తారని జగన్ స్పష్టం చేశారు. 10 మందికి మించి ఎవరూ గుమిగూడవద్దని జగన్ సూచించారు.

బడ్జెట్ ఆమోదం కోసం వీలైనంత త్వరలో అసెంబ్లీ సమావేశం కానున్నట్టు చెప్పారు. రైతులు, రైతు కూలీలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. నీళ్లు, కూరగాయలు, పాలు, ఎలక్ట్రిసిటీ, మెడికల్, గ్యాస్, పెట్రోల్ బంకులు, వాటర్ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఏపీలో మెరుగైన పరిస్థితులు ఏర్పడటానికి గ్రామ వాలంటీర్లే ప్రధాన కారణమన్నారు. గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వాలంటీర్లు అందించారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్ సెంటర్లను సిద్ధం చేస్తున్నామని జగన్ చెప్పారు.

ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మార్చి 31 వరకు మాల్స్, జిమ్ సెంటర్లు, థియేటర్లు మూసివేయనున్నట్టు జగన్ చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 11,670 మందిని ట్రాక్ చేసి స్కాన్ చేసినట్టు సీఎం జగన్ వెల్లడించారు. ఆదివారం నుంచి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నిలిపివేయనున్నట్టు చెప్పారు. 

See Also | ఉచిత రేషన్, కేజీ కందిపప్పు.. రూ.1000 ఇస్తాం : జగన్