Ys Jagan Mohan Reddy : జగన్.. అసెంబ్లీకి వస్తారా? రారా? 24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు..
అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదని తేల్చి చెప్పారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

Ys Jagan Mohan Reddy : ఏపీలో ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో 11 సీట్లే దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఉత్కంఠగా మారింది. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా అంశంపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా రాదు..
అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదని తేల్చి చెప్పారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా కావాలంటే కచ్చితంగా 18 మంది ఎమ్మెల్యేలు ఉండి తీరాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రానని జగన్ సెలవు కూడా కోరలేదన్నారు. 60 రోజుల్లో జగన్ అనర్హతకు గురవుతారని చెప్పారు.
Also Read : ఏపీలో 30వేల కోట్ల లిక్కర్ స్కాం.. ఢిల్లీ స్కాం కంటే 10 రెట్లు పెద్దది.. సీఎం రమేష్ సంచలనం..
తమది గౌరవ సభ అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. గతంలో చంద్రబాబును వాళ్లు అగౌరవపరిచారని, టీడీపీ వాళ్లు తమను కూడా అలాగే చేస్తారని వైసీపీ వాళ్లు అనుకుంటే పొరపాటే అన్నారు. తాను డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అసెంబ్లీకి రావాలని జగన్ ను కోరినట్లు చెప్పారాయన.
ఈ నెల 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని, అలాగే సభలో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎంత సమయం కేటాయిస్తారో అంతే సమయం జగన్ కూ కేటాయించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశమే లేదన్నారు.
జగన్ కోసం నిబంధనలను సవరించాలా? రాజ్యాంగాన్ని మార్చాలా?
జగన్ కోసం నిబంధనలను సవరించాలా, రాజ్యాంగాన్ని మార్చాలా అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ పరిస్థితుల్లో 24వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా రారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాత్రం.. జగన్ అసెంబ్లీకి రావాలని, వైసీపీ సభ్యులు సభకు రావాలని, వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తేవచ్చని వాటికి పరిష్కారం దిశగా సూచనలు చేయొచ్చని ఆమోదం పొందినప్పటికీ.. వైసీపీ సభ్యులు ఆ విధంగా వ్యవహరించడం లేదని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు.
Also Read : బాస్ ఈజ్ బ్యాక్.. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ? ఏం జరుగుతోంది?
గత కొంత కాలంగా సభకు రాకుండా ఉన్న వైసీపీ సభ్యులు ఈసారి 15 రోజుల పాటు జరిగే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆయన సభ్యత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హెచ్చరించిన పరిస్థితి ఉంది.