CM Ramesh : ఏపీలో 30వేల కోట్ల లిక్కర్ స్కాం.. ఢిల్లీ స్కాం కంటే 10 రెట్లు పెద్దది.. సీఎం రమేష్ సంచలనం..
ఈ మొత్తం లావాదేవీలు పూర్తిగా నగదుతోనే జరిగాయన్నారు. ఒక్కటి కూడా డిజిటల్ లావాదేవీ జరపనివ్వలేదన్నారు. ఉద్యోగులు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారన్నారు.

CM Ramesh : గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ మద్యం అక్రమాలపై విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్. జగన్ లిక్కర్ స్కాంపై విచారణ జరపాలని లోక్ భలో ఆయన డిమాండ్ చేశారు. లోక్ సభ జీరో అవర్ లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్. జగన్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కాం జరిగిందని ఆయన బాంబు పేల్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే జగన్ కుంభకోణం 10 రెట్లు పెద్దదని సంచలన ఆరోపణలు చేశారు.
లావాదేవీలన్నీ నగదు రూపంలోనే, ఉద్యోగులు కూడా కాంట్రాక్ట్..
లోక్‌సభ జీరో అవర్ లో ఏపీ లిక్కర్ పాలసీ అంశాన్ని ఎంపీ సీఎం రమేశ్ లేవనెత్తారు. 2019-2024 మధ్య కాలంలో ఏపీలో లిక్కర్ పాలసీని మార్చారని చెప్పారు. ప్రైవేట్ దుకాణాల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అమ్మకాల బాధ్యత అప్పగించారని తెలిపారు. ఐదేళ్లలో లక్ష కోట్లకుపైగా విలువైన అమ్మకాలు జరిగాయని వివరించారు.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ హడల్.. చికెన్, గుడ్లు తింటున్నారా.. అయితే, తప్పనిసరిగా ఇలా చేయండి
ఈ మొత్తం లావాదేవీలు పూర్తిగా నగదుతోనే జరిగాయన్నారు. ఒక్కటి కూడా డిజిటల్ లావాదేవీ జరపనివ్వలేదన్నారు. ఉద్యోగులు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారన్నారు. రూ.2,500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చితే ఏపీలో 10 రెట్లు పెద్ద స్కాం జరిగిందని ఎంపీ సీఎం రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం రమేశ్ బీజేపీ కోసం పని చేయడం లేదు, తెలుగుదేశం కోసం పని చేస్తున్నారు-మిథున్ రెడ్డి
సీఎం రమేశ్ మాట్లాడుతుండగా.. మధ్యలో జోక్యం చేసుకున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఆయన బీజేపీ కోసం పని చేయడం లేదు, తెలుగుదేశం కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందడం కోసం ఇలా మాట్లాడుతున్నారని ఎదురుదాడికి దిగారు.
Also Read : బాస్ ఈజ్ బ్యాక్.. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ? ఏం జరుగుతోంది?
సీఎం రమేశ్ అన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నేను మార్గదర్శి స్కాం గురించి మాట్లాడినందుకు ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మార్గదర్శి స్కామ్ చాలా పెద్ద కుంభకోణం అని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.