చిత్తూరులో వండర్ : క్వారంటైన్ లో తల్లితో పాటు ఉన్న బాబుకు సోకని కరోనా

చిత్తూరులో అద్బుతం చోటు చేసుకుంది. క్వారంటైన్ లో చికిత్స తీసుకున్న తల్లితో పాటు ఉన్న బాలుడికి కరోనా వైరస్ సోకలేదు. సుమారు 18 రోజుల పాటు తల్లితో పాటు ఉన్నా వైరస్ వ్యాపించకపోవడం..వైద

చిత్తూరులో వండర్ : క్వారంటైన్ లో తల్లితో పాటు ఉన్న బాబుకు సోకని కరోనా

Updated On : January 20, 2022 / 5:09 PM IST

చిత్తూరులో అద్బుతం చోటు చేసుకుంది. క్వారంటైన్ లో చికిత్స తీసుకున్న తల్లితో పాటు ఉన్న బాలుడికి కరోనా వైరస్ సోకలేదు. సుమారు 18 రోజుల పాటు తల్లితో పాటు ఉన్నా వైరస్ వ్యాపించకపోవడం..వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇదొక అద్బుతం అంటున్నారు. ఎలాంటి వైరస్ లేదని నిర్ధారించుకున్న తర్వాత..వారిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది.

ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. వేయికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వైరస్ కేసులు నమోదు కాని ప్రాంతంలో కేసులు రికార్డు కావడం కలకలం సృష్టించింది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి చిత్తూరు అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఓ కుటుంబానికి వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని  చిత్తూరు కోవడ్ ఆసుపత్రికి తరలించారు.

క్వారంటైన్ లో చికిత్స అందించారు. కానీ..ఓ మహిళకు ఏడాది బాలుడు కూడా ఉన్నాడు. బాలుడిని తన దగ్గరనే ఉంచుకుంటానని చెప్పింది. సాంఘీక సంక్షేమ శాఖ సిబ్బందికి అప్పగిస్తామని చెప్పినా..తల్లి నో చెప్పింది. చివరకు తల్లి దగ్గరనే ఉంచారు. చివరగా…18 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న తర్వాత…వీరికి పరీక్షలు నిర్వహించారు. వీరికి కరోనా సోకలేదని తేలింది. మూడు, నాలుగు సార్లు పరీక్షలు నిర్వహించగా..నెగటివ్ వచ్చింది. దీంతో వారిని ఇంటికి పంపించారు.