YS Jagan: వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే.. పార్టీ నేతలకు కీలక ఆదేశాలు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

YS Jagan
YS Jagan Tirupati Tour: తిరుపతి లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో ఏపీలో ఎన్డీయే కూటమిలోని పార్టీల నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలకు నిర్వహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి జగన్ మోహన్ రెడ్డి వెళ్తారు.
Also Read : Pawan Kalyan: వైఎస్ జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో.. కూటమి శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచన
ఇవాళ సాయంత్రం 5గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు చేరుకుంటారు. రాత్రి 7గంటలకు జగన్ తిరుమలకు వెళ్తారు. రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల ఆలయానికి జగన్ వెళ్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. 11.30గంటలకు ఆలయం నుంచి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. 11.50 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయంకు బయలుదేరుతారు. 1.30 గంటలకు రేణిగుంట నుంచి బెంగళూరుకు జగన్ మోహన్ రెడ్డి వెళ్తారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే.. తిరుపతి పర్యటన సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తన తిరుపతి పర్యటన నేపథ్యంలో ఎటువంటి హడావుడి చేయొద్దని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు. ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం జరగాలని, ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తేలా పార్టీ శ్రేణులు కారకులు కావొద్దని జగన్ అన్నారు.