టీడీపీలోకి వైసీపీ నేత అవనాపు విజయ్?
విజయనగరం నియోజకవర్గం తొలి సమన్వయకర్తగా అవనాపు విజయ్ పని చేశారు. కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారాయన.

Avanapu Vijay To Join TDP
Avanapu Vijay : విజయనగరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ యువనేత అవనాపు సూరిబాబు వారసుడు విజయ్ టీడీపీలోకి వెళ్లారని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు అనే చర్చ జరుగుతోంది. విజయనగరం నియోజకవర్గం తొలి సమన్వయకర్తగా అవనాపు విజయ్ పని చేశారు. కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారాయన.
విజయనగరం జిల్లాలోనే తొలిసారిగా వైసీపీ పార్టీ ఆవిర్భావ సమయంలో మొట్టమొదటగా అవనాపు కుటుంబం వైసీపీలో చేరింది. ఆ తర్వాత వైసీపీలో పని చేస్తూ కొనసాగారు. అవనాపు సూరిబాబుకు ఇద్దరు కుమారులు. అవనాపు విజయ్, అవనాపు విక్రమ్. చిన్న కుమారుడు అవనాపు విజయ్ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేథ్యంలో ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అవనాపు విజయ్ టీడీపీలో చేరతారు అనే ప్రచారం జోరందుకుంది. దీనిపై స్పందించడానికి విజయ్ నిరాకరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో అవనాపు విజయ్ తెలుగుదేశం పార్టీలో చేరతారు అనే వార్తలు వస్తున్నాయి.
Also Read : డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు..! సిక్కోలు వైసీపీలో హైటెన్షన్
కొంతకాలంగా ఆయన వైసీపీకి దూరంగా ఉండటం ఈ ప్రచారానికి బలమిస్తోంది. గత ఎన్నికల్లో విజయనగరం వైసీపీ టికెట్ ను విజయ్ ఆశించారు. కానీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటి నుంచి కూడా పార్టీలో చురుగ్గా లేరు. ఇక, విజయ్ సోదరుడు విక్రమ్ భార్యకి డీసీఎంఎస్ ఛైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఈ వ్యవహారంతో విజయ్ మరింత నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో విజయనగరం టికెట్ ను బీసీకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తనకు అవకాశం వస్తుందనే ఆశతో అవనాపు విజయ్ టీడీపీలోకి వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : న్యూఇయర్ వేడుకల మాటున ఆ నేతల బలప్రదర్శన.. కాకినాడ జిల్లాలో కాక