Andhra Pradesh : అనంతపురంలో వైసీపీ నేతపై హత్యాయత్నం..?!
అనంతపురం జిల్లాలో వైసీపీ నేత కారు ప్రమాదానికి గురి అయ్యింది. తనను హత్య చేయటానికి నాకారు ప్రమాదానికి గురి చేశారని ఆరోపిస్తున్నారు సదరు నేత..

YCP leader car accident
Andhra Pradesh : వైసీపీ నేతపై హత్యయత్నం జరిగినట్లుగా పోలీసులు విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని బొందలదిన్నెలో వైసీపీ నేతల హరినారాయణ కారును మరో కారు ఢీకొంది. ఈ ఘటన నుంచి హరినారాయణ తప్పించుకున్నారు. అనంతరం హరినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కారుతో ఢీకొట్టి హరినారాయణను హత్య చేయాలని ప్లాన్ వేసినట్లుగా భావించిన పోలీసులు ఆయన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు.
తాడిపత్రిలో అర్థరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక వైసీపీ నాయకుడు హరినారాయణ రెడ్డి వాహనాన్ని బొందలదిన్నె సమీపంలో మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదం నుంచి హరినారాయణ సురక్షితంగా బయటపడ్డారు. ఈక్రమంలో హరినారాయణ కారును ఢీకొట్టిన వాహనం డ్రైవర్ పరారైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపైతాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. హరినారాయణ కారును ఢీకొన్న వాహనం ఎవరిది? వాహనం డ్రైవర్ ఎవరు? కావాలనే ఢీకొట్టారా? లేక ప్రమాదవశాత్తు ఇలా జరిగిందా? అనేదానిపై దర్యాప్తు చేపట్టారు. హరినాయరణ మాత్రం తన ప్రత్యర్థులు తననుచంపేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. నిందితులను గుర్తించి..తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.