జగన్‌ను చంపెయ్యాలి, కార్యాలయాలు కూల్చేయాలి..! ఇదేనా మీ విధానం?- వైసీపీ నేతలు ఫైర్

మా కార్యాలయాలు నిజంగా చట్ట విరుద్ధంగా ఉంటే అధికారులు వెళ్ళాలి. టీడీపీ నేతలకు ఏం పని..?

జగన్‌ను చంపెయ్యాలి, కార్యాలయాలు కూల్చేయాలి..! ఇదేనా మీ విధానం?- వైసీపీ నేతలు ఫైర్

Ycp Warning : వైసీపీ కార్యాలయాలకు నోటీసుల వ్యవహారం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని వార్నింగ్ లు ఇస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయింపు జరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వైసీపీ పార్టీ ఆఫీసులకు నోటీసుల వ్యవహారంపై అంబటి రాంబాబు, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.

‘చంద్రబాబు గతంలో అధికారంలో ఉండగానే 10 చోట్ల భూములు కేటాయించుకున్నారు. ఆ జీవో ప్రకారమే చట్ట ప్రకారమే మా పార్టీ కార్యాలయాలకు కేటాయింపు జరిగింది. చట్ట ప్రకారం నిర్మాణం జరుగుతున్న తాడేపల్లిలోని మా కార్యాలయం కూల్చేశారు. మిగిలిన కార్యాలయాలు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. జగన్ ను చంపెయ్యాలి.. కార్యాలయాలు కూల్చెయ్యాలి ఇదేనా మీ విధానం..? మా కార్యాలయాలు నిజంగా చట్ట విరుద్ధంగా ఉంటే అధికారులు వెళ్ళాలి. టీడీపీ నేతలకు ఏం పని..? టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మా పార్టీ కార్యాలయాలకు వెళ్ళడం అరాచక పాలనకు నిదర్శనం. మేము చట్ట ప్రకారం న్యాయపోరాటం చేస్తున్నాం. కోర్టులో తేల్చుకుందాం. ఇలాంటి అరాచక సంప్రదాయాలు మీరు పాటిస్తే అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి.

టీడీపీ అధికారంలో ఉండగానే వచ్చిన జీవో ప్రకారం భూముల కేటాయింపు జరిగింది. వైసీపీ పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు చట్టప్రకారం జరిగింది. మా ఆఫీసుల్లోకి వచ్చి టీడీపీ నేతలు ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడితే ఎటు దారితీస్తుందో మీకే వదిలేస్తున్నాం” అని వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

Also Read : ఒక్క ఓటమితో సీన్ రివర్స్..! చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని భారీ డైలాగ్‌లు, కట్ చేస్తే..