Vishaka : ఇక విశాఖలో వ్యాపారం చేయను ఎంపీ ఎంవీవీ ప్రతిజ్ఞ
ఎస్పీ స్థలానికి, తమ స్థలానికి సంబంధమే లేదని... కబ్జా ఆరోపణలు అవాస్తవమన్నారు. పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారనే కల్వర్టు కట్టామని.. ఆయన స్థలానికి తనకు సంబంధం లేదన్నారు...

Mpp Mvv
YCP MP MVV : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై విశాఖలో వ్యాపారం చేయనంటూ ప్రతిజ్ఞ చేశారు. తన వల్ల పార్టీకి, సీఎం జగన్‌కు చెడ్డపేరు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంచలన ప్రకటన చేశారు ఎంవీవీ. కేవలం వైసీపీ ఎంపీని కావడం వల్లే తనపై బురద జల్లుతున్నారని.. ఇకపై వీటన్నింటికి చెక్ పెట్టాలని అనుకుంటున్నట్టు తెలిపారు ఎంవీవీ. విశాఖలో ఎంపీ వర్సెస్ ఎస్పీగా మారిన భూ వివాదానికి తెర పడిన సంగతి తెలిసిందే. ఓ స్థలం విషయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాణ, ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు మధ్య వివాదం నెలకొందంటూ వచ్చిన వార్తలపై వారిద్దరు స్పష్టతనిచ్చారు. ఎలాంటి ఆక్రమణలు జరగలేదన్న క్లారిటీ ఇచ్చారు. ఎంపీకి చెందిన ఎంవీవీ బిల్డర్స్ వెంచర్‌కు తమ స్థలంలో కల్వర్టు నిర్మించారని నిన్న ఎస్పీ ఫిర్యాదు చేశారు.
Read More :Visakha SP Vs MP: విశాఖలో ఎస్పీ వర్సెస్ ఎంపీ: భూకబ్జా వ్యవహారంపై వివరణ ఇచ్చిన ఇరువురు
బక్కన్న పాలెం సర్వె నెంబర్ 90/Aలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్పీ మధు 668 గజాల స్థలం కొనుగోలు చేశారు. అందులో 500 గజాలు ప్రభుత్వ స్థలం ఉన్నట్టు గుర్తించారు. దీంతో 500 గజాల స్థలాన్ని వదులుకున్నారు ఎస్పీ. ఆ స్థలాన్ని ఆనుకుని ఉన్న భూమిలో విశాఖ ఎంపీ ఎంవీవీకి చెందిన 8 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ వేశారు. గతంలో బక్కన్న పాలెం వాసులు ఈ లేఅవుట్ నుంచి రాకపోకలు సాగించేవారు. అయితే కొత్తగా మురుగు కాలువ గుండా కల్వర్టు నిర్మాణం చేపట్టింది ఎంపీ ఎంవీవీ బిల్డర్స్. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అయితే ఎస్పీ మధుకు చెందిన స్థలాన్ని రహదారిగా వినియోగించుకుంటున్నారు స్థానికులు. తన స్థలంలో కాంపౌడ్ వాల్ నిర్మిస్తుండగా…కొందరు అడ్డుకున్నారంటున్నారని ఆరోపించారు మధు. కబ్జా ఆరోపణలపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.
Read More : Online Cinema Tickets : ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్‌లో సినిమా టిక్కెట్లు.. మొత్తం రెడీ అంటున్న ఏపీ ప్రభుత్వం..
ఎస్పీ స్థలానికి, తమ స్థలానికి సంబంధమే లేదని… కబ్జా ఆరోపణలు అవాస్తవమన్నారు. పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారనే కల్వర్టు కట్టామని.. ఆయన స్థలానికి తనకు సంబంధం లేదన్నారు. తనపై కొందరు కావాలనే కుట్రలు చేసి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు ఎంపీ. తన స్థలాన్ని ఎంపీ కబ్జా చేశారని ఎక్కడా చెప్పలేదన్నారు ఇంటలీజెన్స్ ఎస్పీ మధు. కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కొందరు అడ్డుకున్నారని మాత్రమే తాను చెప్పానన్నారు. తన స్థలాన్ని ఎంపీ కబ్జా చేయలేదని స్పష్టతనిచ్చారు. కాంపౌండ్ వాల్ కోసం జీవీఎంసీ అనుమతి తీసుకోవాలంటే.. ఖచ్చితంగా తీసుకుంటానన్నారు.