YCP MP RRR : ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

YCP MP RRR : ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ

Ycp Mp Rrr

Updated On : June 5, 2021 / 11:47 AM IST

YCP MP RRR : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీస్  ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. భీమవరం ఆక్వా సంస్కృతికి రాజధాని అని ఆయన లేఖలో వివరించారు.

ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ గవర్నర్‌కు మరోక లేఖ రాశారు. రాజద్రోహం కింద అరెస్టై  పీలేరు సబ్ జైలులో ఉన్నజడ్జి  రామకృష్ణను తిరుపతి ఆస్పత్రికి తరలించాలని కోరారు. రామకృష్ణ   ఆరోగ్య పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం అందించాలని రఘురామ లేఖలో పేర్కోన్నారు. కాగా…ఎంపీ రఘురామ కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు.