Vijayasai Reddy : పురందేశ్వరిపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి
తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాధులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురందేశ్వరిది.

Vijayasai Reddy Purandeswari
Vijayasai Reddy – Purandeswari : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా తనవంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహాగొప్ప మహిళ పురందేశ్వరి అంటూ అన్నారు. విజయసాయి ట్వీట్ ప్రకారం.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురందేశ్వరి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం.
తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాధులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురందేశ్వరిది. ఆంధ్రప్రదేశ్ ను అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా తనవంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహాగొప్ప మహిళ ఈ పురందేశ్వరి అంటూ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఇదిలాఉంటే కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి వర్సెస్ పురందేశ్వరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో విజయసాయి రెడ్డిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు పురందేశ్వరి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి తన పదవులను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి కోరారు. విజయసాయి రెడ్డి పలువురిని బెదిరిస్తూ అక్రమాలకు దిగారని ఆరోపణలు ఉన్నాయని, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జిగా వున్న సమయంలో కడప గూండాలనుదించి అక్కడ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని లేఖలో పురందేశ్వరి పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఆయనపై ఉన్న కేసుల వివరాలను పేర్కొంటూ.. వెంటనే విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో పురందేశ్వరి కోరారు.
విజయసాయిరెడ్డిసైతం పురందేశ్వరికి కౌంటర్ గా విమర్శలు చేశారు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది పార్టీ టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వడాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్ కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే.. మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా? అంటూ విజయసాయిరెడ్డి పురందేశ్వరిని ప్రశ్నించారు.
1/3: ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం.
2/3: తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2023