YCP Workers Attack On TDP Office : ఏపీలో టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడి

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్యంసం సృష్టించారు.

YCP Workers Attack On TDP Office : ఏపీలో టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడి

Ycp Workers Attack On Tdp Office

Updated On : October 19, 2021 / 6:43 PM IST

YCP Workers Attack On TDP Office :  గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్యంసం సృష్టించారు. ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మనేని పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో  వైసీపీ కార్యకర్తలు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపైకి దండెత్తి వచ్చారు. పార్టీ కార్యాలయంలోని పార్టీ కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ తో సహా కార్యాలయం వద్ద పార్క్ చేసిన పలు వాహనాలను వారు ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీసులోని నేతలపైనా కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేసారు. వీరంతా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచురులుగా  తెలుస్తోంది.

ఈ దాడిలో ఒక వ్యక్తికి తలపగిలింది. అతడ్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కార్యాలయం వద్దకు వచ్చి వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు  విజయవాడ  లోని పట్టాభి ఇంటిపై కూడా కొందరు వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ఇంట్లో విధ్వంసం సృష్టించారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు  విలేకరులకు తెలిపారు.

Also Read : Mogali Rekulu : నా భర్తకు అమ్మాయిల పిచ్చి… మొగలిరేకులు సీరియల్ దయ బాగోతం

కాగా…. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమయంలో టీడీపీ కార్యాలయాలు, నాయకులు ఇళ్ల వద్ద వైసీపీ నేతలు దాడులు నిరసనలకు దిగారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతకు ముందు ఆయన పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు.రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని చంద్రబాబు నాయుడు అమిత్‌షా ను కోరారు.

విశాఖపట్నంలో టీడీపీ ఆఫీసు వద్ద కూడా వైసీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు టీటీపీ ఆఫీసును చుట్టుముట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  టీడీపీ కార్యాలయాలపైనా, టీడీపీ నాయకుల ఇళ్లపైనా వైసీపీ కార్యకర్తలు మంగళవారం సాయంత్రం ఏకకాలంలో దాడులు, నిరనసలు చేపట్టినట్లు తెలుస్తోంది.