‘దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడు’.. తన మీద జరిగిన దాడిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

YS Jagan: తన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుందని, కానీ, పేదల విషయంలో..

‘దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడు’.. తన మీద జరిగిన దాడిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

YS Jagan

కృష్ణాజిల్లా గుడివాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తన మీద ఇటీవల జరిగిన దాడిపై స్పందించారు. తన నుదుటి మీద చేసిన గాయంతో తాను బయటపడ్డానంటే.. దేవుడు తన విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడని అర్థం అని చెప్పారు.

తన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుందని, కానీ, పేదల విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన గాయాలు ఎప్పటికీ మానవని తెలిపారు. రాయి విసిరినంత మాత్రాన తన సంకల్పం ఏమీ చెక్కుచెదరదని తెలిపారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోనని తెలిపారు.

తాను మంచి చేశామన్న ధైర్యంతో నిలబడ్డానని చెప్పారు. తమపై ఎన్నో కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అందరూ కలిసి తనపై బాణాలు సంధిస్తున్నారని చెప్పారు. ప్రజలకు మంచి చేసిన తనపై దాడి చేస్తున్నారని తెలిపారు. తనకు చేసిన మంచి మీద నమ్మకం ఉందని చెప్పారు.

తనపై ఒక్క రాయి విసిరినంత మాత్రాన ఎన్నికల కురుక్షేత్రంలో విపక్షాల ఓటమి ఏమీ ఆగిపోదని అన్నారు. ఈ స్థాయికి వారు దిగజారారంటే వైసీపీ విజయానికి అంతగా చేరువవుతోందని అర్థమని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం తనలో మరింత పెరుగుతుందని చెప్పారు.

Kadiyam Srihari: మేము ఆ ఓటమిని ఊహించలేదు: కడియం శ్రీహరి