కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దాం, మరోసారి పాదయాత్ర ఉంటుంది- జగన్ కీలక వ్యాఖ్యలు

ఈలోపు కార్యకర్తలకు అండగా ఉండండి అని పార్టీ నేతలకు సూచించారు జగన్. వారం రోజుల పాటు ప్రతీ కార్యకర్తను కలిసి ధైర్యం చెపాల్పని పార్టీ నేతలతో చెప్పారు జగన్.

కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దాం, మరోసారి పాదయాత్ర ఉంటుంది- జగన్ కీలక వ్యాఖ్యలు

Updated On : June 20, 2024 / 5:51 PM IST

Ys Jagan Mohan Reddy : మాజీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని వైఎస్ జగన్ వారితో అన్నారు. ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ నడుస్తోందని ఆయన కామెంట్ చేశారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఎంతవరకు అమలు చేస్తుందో చూద్దాం అని జగన్ వ్యాఖ్యానించారు.

6 నెలల తర్వాత ప్రతీ కార్యకర్తను కలుస్తానని జగన్ తెలిపారు. మూడు సంవత్సరాల తర్వాత పాదయాత్ర కూడా ఉంటుందన్నారు. ఈలోపు కార్యకర్తలకు అండగా ఉండండి అని పార్టీ నేతలకు సూచించారు జగన్. వారం రోజుల పాటు ప్రతీ కార్యకర్తను కలిసి ధైర్యం చెపాల్పని పార్టీ నేతలతో చెప్పారు జగన్.

చంద్రబాబుపై కోపం వస్తుంది, మనంపై అభిమానం వ్యక్తమవుతుంది- జగన్
ఇక వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్న జగన్.. బాధితులను పరామర్శిస్తామన్నారు. నష్టపోయిన ప్రతీ కార్యకర్తను కలుస్తానని, కార్యకర్తలకు భరోసా ఇస్తానన్నారు జగన్. విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ముఖ్య నేతలు అంతా పాల్గొన్నారు. నేతలకు పలు కీలక సూచనలు చేశారు జగన్. ఓడిపోయాం అన్న భావనను మనసులో నుంచి తీసేయాలని నేతలతో చెప్పారు. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదన్న జగన్.. ప్రతి ఇంట్లో మనం చేసిన మంచి ఉందన్నారు. ప్రతి ఇంటికి తలెత్తుకుని పోగలమన్న జగన్.. ప్రజల వద్దకు గౌరవంగా వెళ్లగలుతున్నామన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై ప్రజల్లో కోపం వస్తుందని, మన పట్ల అభిమానం వ్యక్తమవుతుందని, మళ్లీ రికార్డ్ మెజార్టీతో గెలుస్తామన్నారు. మోసపోతున్న వారికి అండగా నిలవాలని నేతలకు సూచించారు జగన్.

Also Read : రాజకీయాలకు పనికి రారని తిట్టారు, జనసేన మూసేయాలని విమర్శించారు.. కట్ చేస్తే..