YS Sharmila : జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila : జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

YS Sharmila

Updated On : November 14, 2024 / 11:05 AM IST

YS Sharmila: కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా జగన్ తీరు ఉందంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఏపీ బడ్జెట్ పై జగన్ ప్రెస్ మీట్ ను ఉద్దేశిస్తూ షర్మిల మాట్లాడారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులం వైసీపీ కంటే ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. మేము చెప్పిందే జగన్ మళ్లీ చెప్పారు. మీకు మాకు పెద్ద తేడా లేదు. వైసీపీ 38శాతం ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు.. మీకుమాకు తేడా లేదని షర్మిల అన్నారు.

Also Read; Varma: బాబు, పవన్‌ మెచ్చిన నేతకు పెద్దపీట వేస్తారా? పిఠాపురం వర్మను వరించబోయే పదవి ఏంటి?

38శాతం ఓటు షేర్ పెట్టుకొని అసెంబ్లీకిపోని వైసీపీని నిజానికి ఒక “ఇన్ సిగ్నిఫికెంట్”పార్టీగా మార్చింది జగన్ మోహన్ రెడ్డి అని, అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యలకోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవ్వాళ రాష్ట్రంలో అసలైన “ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ” అని షర్మిల విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. సొంత మైకుల ముందు మాట్లాడటానికి కాదు.. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ది ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి అంటూ జగన్ మోహన్ రెడ్డికి షర్మిల సవాల్ చేశారు.

Also Read : AP Legislative Council :వైసీపీ నాయకులపై మండలి చైర్మన్ ఆగ్రహం

అసెంబ్లీకి వెళ్లి ప్రతిపక్షం కాకపోయినా 11 మందితో ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామా చేయండి, ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ అనేది తేలుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి.. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలని షర్మిల డిమాండ్ చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయింపుపై నిలదీయండి అంటూ షర్మిల పేర్కొన్నారు.