YS viveka case : అవినాశ్, భాస్కర్, ఉదయ్ రెడ్డి ముగ్గురిని కలిపి విచారించనున్న సీబీఐ.. ఆరు రోజులు ఏకధాటిగా సీబీఐ ప్రశ్నల వర్షం

వివేకా హత్య కేసులో మాకేపాపం తెలియదంటున్నారు నిందితులు..హత్య చేయటమేకాదు దీనికి సంబంధించి వీరే కీలక వ్యక్తులు అని సీబీఐ అంటోంది. బెయిల్ ఇవ్వాలని కోరుతున్న నిందితులు..బెయిల్ ఇవ్వటానికివీల్లేదంటున్న సీబీఐ. బెయిల్ ఇస్తునే ప్రతీరోజు విచారణకు కావాలంటోంది న్యాయస్థానం. ఇలా వివేకా హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు.

YS viveka case : అవినాశ్, భాస్కర్, ఉదయ్ రెడ్డి ముగ్గురిని కలిపి విచారించనున్న సీబీఐ.. ఆరు రోజులు ఏకధాటిగా సీబీఐ ప్రశ్నల వర్షం

YS viveka case

Updated On : April 19, 2023 / 10:27 AM IST

YS viveka case : వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలను ఎదుక్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఫిబ్రవరి 25 వరకు అరెస్ట్ చేయొద్దని చెబుతునే 25 వరకు ప్రతిరోజు అవినాష్ విచారణకు హాజరుకావాలన్న హైకోర్టు స్పష్టంచేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు సుదీర్ఘంగా కొనసాగిన క్రమంలో ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.వివేకాను హత్య చేసి సాక్ష్యాధారాలను తారుమారు చేయటంతో అవినాశ్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డి కీలకంగా ఉన్నారని దానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కాబట్టి అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ కోర్టుకు విన్నవించింది. కానీ కోర్టు మాత్రం 25 వరకు అరెస్ట్ చేయొద్దని చెబుతునే 25 వరకు అవినాశ్ సీబీఐ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో అవినాశ్ రెడ్డి ఆశించనంత రిలీఫ్ రాలేదు. ఈక్రమంలో కాగా ఇప్పటి వరకు పలుమార్లు సీబీఐ విచారణను ఎదుర్కొన్న అవినాశ్ రెడ్డి తొలిసారిగా ఐఓ వికాశ్ సింగ్ ఆధ్వర్యంలో జరుగనున్న విచారణకు హాజరుకానున్నారు.

YS viveka case : అవినాశ్‌రెడ్డికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు, సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్లు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి.. : సీబీఐ

ఇదిలా ఉంటే ధర్మాసనం ఆదేశాల ప్రకారం అవినాశ్ రెడ్డి ప్రతీరోజు సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు కూడా సీబీఐ విచారణకు హాజరుకానున్నారు అవినాశ్. అంతేకాదు పోలీసుల నుంచి ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను చంచలగూడ జైలునుంచి తమ కస్టడీకి తీసుకుని అవినాశ్ రెడ్డితో కలిపి ముగ్గురిని విచారించనున్నారు సీబీఐ అధికారులు. ఈకేసులో ఇప్పటి వరకు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు విచారణకు సహకరించటంలేదని ఎటువంటి విషయాలు చెప్పటంలేదని కాబట్టి ముగ్గురిని కలిపి విచారించాలనుకుంటున్నామని సీబీఐ కోర్టుకు వెల్లడించింది. దీంట్లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 19,2023)భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ముగ్గురిని ఆరు రోజుల పాటు సీబీఐ విచారించనుంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముగ్గురిని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించనున్నారు.

YS Viveka Case: ఏపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

వివేకా హత్యకేసులో నాకు ఎటువంటి సంబంధంలేదని..తనను కుట్రపూరితంగా నిందిడిని చేసి విచారణల పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పీటీషన్ లో పేర్కొన్న ఆరోపణలకు సీబీఐ గట్టి సమాధానమిచ్చింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని తేల్చి చెప్పంది. దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ లను కూడా కలెక్ట్ చేశామని కోర్టుకు సీబీఐ వెల్లడించింది. తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణకు సంబంధించి వాదనలు కొనసాగిన క్రమంలో కోర్టు అడిగిన ప్రశ్నలకు సీబీఐ సమాధానమిస్తు ఈ హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని పక్కాగా మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని వాటికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ లను కూడా కలెక్ట్ చేశామని వెల్లడించింది. ఈక్రమంలో అవినాశ్ ని 25వరకు అరెస్ట్ చేయొద్దని చెబుతునే ప్రతీ రోజు సీబీఐ విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఇక రోజు అంటే ఆరురోజుల పాటు విచారణకు అవినాశ్ హాజరుకావాల్సి ఉంది.