Sunita : కాంగ్రెస్‌లోకి సునీతారెడ్డి..? వైఎస్ షర్మిలతో భేటీ
గతకొంతకాలంగా మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ జరుగుతోంది.

YS Vivekanada Reddy Daughter Sunita to met YS Sharmila today
Sunita – YS Sharmila : గతకొంతకాలంగా మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ కానున్నారు. ఇడుపులపాయలోని షర్మిల గెస్ట్ హౌస్‌లో వీరిద్దరి భేటీ జరగనుంది. షర్మిలతో భేటీ అనంతరం సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే సునీత హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో కడపకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఇడుపులపాయలోని వైఎస్ షర్మిల గెస్ట్ హౌస్‌కు వెళ్లింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం చేరుకున్నారు. భేటీ అనంతరం సునీత, షర్మిలలు కలిసి కడపలో జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు అయ్యే అవకాశం ఉంది. కాగా.. భేటీ తరువాత సునీత నుంచి ఏదైన ప్రకటన ఉంటుందా లేదా అన్నది వేచి చూడాల్సింది ఉంది.
Also Read: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కార్యక్రమంపై రాళ్లదాడి.. తొండపిలో తీవ్ర ఉద్రిక్తత