YSR Congress Party : ప్యాకేజీ బంధం బయటపడింది అంటూ పవన్ కల్యాణ్‌పై వైసీపీ సెటైర్లు
చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు పొత్తులపై కుండబద్దలు కొడుతు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు.దీనిపై వైసీపీ వెంటనే స్పందించింది.

TDp Janasena Alliance
YSR Congress Party : చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు పొత్తులపై కుండబద్దలు కొడుతు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు.దీనిపై వైసీపీ వెంటనే స్పందించింది. ‘ప్యాకేజ్ బంధం బయటపడింది’’అంటూ వైసీసీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థమైంది పవన్ కల్యాణ్ అంటూ పేర్కొంది.
Pawan Kalyan : పొత్తులపై కుండబద్దలు కొట్టిన పవన్ కల్యాణ్ .. కలిసే పోటీ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు
ఇన్నాళ్లు నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మినవాళ్లకు ఈరోజుతో ఆ భ్రమలు తొలిగించేవంటూ సెటైర్లు వేసింది. ఇక ఇది పొత్తులకు,ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం..ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు అంతా సిద్ధంగా ఉన్నారంటూ పేర్కొంది.
Pawan Kalyan: జైల్లో చంద్రబాబు భద్రత విషయంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
కాగా ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని వార్తలు కొనసాగుతున్న క్రమంలో పవన్ ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ తరువాత ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇవి కేవలం అంచనా మాత్రంగానే ఉండేది.కానీ పవన్ మీడియా సమక్షంలో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే టీడీపీకి పవన్ దత్తపుత్రుడు అంటూ వైసీపీ నేతలు తరచు సెటైర్లు వేస్తుండేవారు. ఇక దీనిపై క్లారిటీని పవనే ఇచ్చాశారు అంటూ వైసీపీ తనదైన శైలిలో సెటరిక్ గా సోషల్ మీడియాలో పేర్కొంది.