Nara Lokesh : దుబాయ్‌లో భారత్-పాక్ మ్యాచ్ చూసిన మంత్రి నారా లోకేశ్.. తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ..

లోకేశ్, కేశినేని చిన్ని టీమిండియా జెర్సీలో స్టేడియంలో సందడి చేశారు.

Nara Lokesh : దుబాయ్‌లో భారత్-పాక్ మ్యాచ్ చూసిన మంత్రి నారా లోకేశ్.. తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ..

Updated On : February 23, 2025 / 9:49 PM IST

Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్ దుబాయ్ వెళ్లారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు లోకేశ్ దుబాయ్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన నారా లోకేశ్.. స్టేడియంకి వెళ్లి మ్యాచ్ ని వీక్షించారు. లోకేశ్ తో పాటు దుబాయ్ పర్యటనలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు.. ఎంపీలు కేశినేని చిన్ని, సానా సతీశ్, దర్శకుడు సుకుమార్, ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు.

Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై నాదెండ్ల మనోహర్ గుడ్‌న్యూస్‌

లోకేశ్, కేశినేని చిన్ని టీమిండియా జెర్సీలో స్టేడియంలో సందడి చేశారు. అటు ఐసీసీ ఛైర్మన్ జైషాతోనూ లోకేశ్ సమావేశo అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై జైషాతో లోకేశ్ చర్చించారు. మరోవైపు సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు.

కాగా.. భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ కోసం దుబాయ్ వెళ్లిన మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ ఫైర్ అయ్యింది. లోకేశ్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు తమ గోడు పట్టించుకోవాలని అల్లాడిపోతుంటే.. మంత్రి లోకేశ్ మాత్రం దుబాయ్ లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడింది. అధికారం అంటే మీకు విలాసం.. ప్రజల బాధలంటే మీకు సంబరం.. జనం కష్టాలు మీకు సంతోషం అంటూ ధ్వజమెత్తింది. బాధ్యత లేని వారికి అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది అంటూ మంత్రి నారా లోకేశ్ పై విరుచుకుపడింది వైసీపీ.