వైసీపీ తొలి జాబితా విడుదల…గోరంట్ల మాధవ్ కు ఎంపీ సీటు

  • Published By: venkaiahnaidu ,Published On : March 16, 2019 / 03:54 PM IST
వైసీపీ తొలి జాబితా విడుదల…గోరంట్ల మాధవ్ కు ఎంపీ సీటు

వైసీపీ తొలి జాబితా విడుదలయింది. 9మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటించింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ జాబితాను విడుదల చేశారు. కర్నూల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సంజీవ్ కుమార్, అరకు-గొట్టేటి మాధవి, హిందూపురం – గోరంట్ల మాధవ్, అమలాపురం – చింతా అనురాధ, అనంతరపురం – చింతా అనురాధ, కడప – అవినాష్ రెడ్డి, రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చిత్తూరు – ఎన్ రెడ్డప్ప, బాపట్ల – నందిగం సురేష్‌ల పేర్లను ఈ లిస్ట్ లో ప్రకటించారు.

ఈ జాబితాలో గోరంట్ల మాధవ్ పేరుని హిందూపురం అభ్యర్థిగా వైసీపీ ప్రకటించడం విశేషం. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో గొడవ అనంతరం సీఐ పదవికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ ఇటీవల వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.