Jogi Ramesh : టీడీపీలోకి వైసీపీ కీలక నేత జోగి రమేశ్?
ఇప్పుడు సడెన్ గా ఆ మంత్రితో కనిపించడంతో త్వరలోనే ఆయన కూటమి పార్టీలో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Jogi Ramesh : వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన జోగి రమేశ్ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. నూజివీడులోని గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారధితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కొంత కాలంగా వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న జోగి రమేశ్.. ఇప్పుడు సడెన్ గా మంత్రి పార్థసారధితో కనిపించడంతో త్వరలోనే ఆయన కూటమి పార్టీలో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
నూజివీడు నియోజకవర్గంలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేశ్ హాజరయ్యారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పార్ధసారధితో కలిసి నూజివీడు పురపాలక పరిధిలో కలిసి ర్యాలీగా తిరగడం ఆసక్తికర అంశంగా మారింది. కొంతకాలంగా వైసీపీకి కొంచెం దూరంగా ఉంటున్నారు జోగి రమేశ్. ఆయన మంత్రి పార్ధసారథితో కలిసి ర్యాలీగా తిరగడం, గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనటం, టీడీపీ నేతలతో యాక్టివ్ గా ఉండటం పట్ల అనేక రకమైన ఊహాగానాలు జరుగుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో జోగి రమేశ్ పై కేసు నమోదైంది. అటు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేశ్ కొడుకుపై కేసు నమోదైంది. ఈ విధంగా అనేక రకాల అంశాలు ఉన్న నేపథ్యంలో.. జోగి రమేశ్ కొంతకాలంగా వైసీపీకి అంటీ ముట్టన్నట్లుగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఆయన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో మంత్రి పార్ధసారధి, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ, ఇతర నేతలతో కలిసి పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే జోగి రమేశ్ టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read : జమిలిపై వైసీపీ ఆశలు.. ఎన్నికలకు రెడీ కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు