Chandrababu : దమ్ముంటే.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేసి గెలవాలి-చంద్రబాబుకి వైసీపీ ఎంపీ సవాల్
Chandrababu : ఆల్రెడీ ప్రజలు అంతుచూసినా.. చంద్రబాబుకి బుద్ధి రాలేదు. దళితుల అంతుచూస్తా అని చంద్రబాబు బెదిరించడం కరెక్ట్ కాదు.

Chandrababu(Photo : Google)
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ నందిగం సురేశ్. ఎప్పుడైనా, ఎక్కడైనా సింగిల్ గా పోటీ చేసి గెలవడం చంద్రబాబు చరిత్రలో ఉందా? అని ఎంపీ సురేశ్ ప్రశ్నించారు. చంద్రబాబుకి దమ్ముంటే, మగాడైతే ఎవరి సపోర్ట్ లేకుండా 175 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేసి గెలిచి చూపించాలని ఎంపీ సురేశ్ సవాల్ విసిరారు. చంద్రబాబుకి పెద్ద వయసు వచ్చినా బుద్ధి మాత్రం మారలేదని విమర్శించారు.
చంద్రబాబు బుద్ధి మళ్ళీ ఈరోజు దళితులపై చూపించారని మండిపడ్డారు. ప్రస్టేషన్ లో ఉన్న చంద్రబాబు దళితులపై కక్ష కట్టారని అన్నారు. చంద్రబాబు అంతు ఆల్రెడీ ప్రజలు చూసినా.. ఆయన బుద్ధి మారలేదన్నారు. ఆదిమూలపు సురేశ్ కు నేనేంటో చూపిస్తా అంటున్న చంద్రబాబు.. అక్కడ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారని అన్నారు. దళితుల అంతుచూస్తా అని చంద్రబాబు బెదిరించడం కరెక్ట్ కాదన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. తన హయాంలో మాయమాటలు చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
‘ చంద్రబాబు మాట్లాడే భాష మార్చుకుంటారు అనుకుంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు వీరుడు ధీరుడు అంటున్నారు.. మరి లోకేశ్ ను గెలిపించుకోలేకపోయారు. జగన్ ప్రజల్లో బలంగా ఉన్నారు. అమరావతి, పోలవరం పేరుతో లక్షల కోట్లు అవినీతి చేశారు చంద్రబాబు. ఈ పథకం చేశాను అని ఒక్క పథకం పేరు అయినా చంద్రబాబు చెప్పాలి.
లోకేశ్ తన పాదయాత్రలో జనాలను కొనుక్కుని తిప్పుతున్నారు. రాష్ట్రంలో ఒకవైపు కొడుకు, మరొకవైపు తండ్రి తిరిగే పరిస్థితిని చంద్రబాబు, లోకేశ్ కు జగన్ కల్పించారు. అబ్బా కొడుకులు సిగ్గు లేకుండా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. కుప్పంలో చంద్రబాబు గెలవలేడు కానీ జగన్ ను ఏదో చూస్తాంట. దళితలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. లేకుంటే రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా నిరసన తెలుపుతాం.
Also Read..TTD : భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు .. టీటీడీ విజిలెన్స్‌కు చిక్కిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జి
రౌడీయిజంతో ప్రజలను బెదిరించి మళ్ళీ అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. రాష్ట్రం బాగుండాలంటే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. మీ మేనిఫెస్టో తీసుకురండి. మా మేనిఫెస్టో తెస్తాం. చర్చకు చంద్రబాబు సిద్ధమా?
చంద్రబాబు తొడ కొడదామని చూస్తే మెడ కొడతాం.
రాజకీయం కోసం ఎలాంటి దుర్మార్గానికి అయినా చంద్రబాబు పాల్పడతారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు అడ్డదారిలో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర ప్రజలు ఓటు ఎవరికి వేయాలో తెలుసు. చంద్రబాబు చీటింగ్, మోసాలు తప్ప ఏమీ చేయలేదు. సానుభూతి కోసం చంద్రబాబు అల్లర్లు సృష్టిస్తారు. Nsg కమాండోకు గాయమైందని అంటున్నారు. ఇది చంద్రబాబు వ్యూహంలో భాగమే. కమల్ హాసన్ యాక్టింగ్ చేయాల్సిన ఖర్మ చంద్రబాబుకి పట్టింది” అని ధ్వజమెత్తారు ఎంపీ సురేశ్.