CM Jagan : మళ్లీ సీఎం కాగానే నా మొట్టమొదటి సంతకం దానిపైనే- ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు

కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం దానిపైనే చేస్తాను.

CM Jagan : మళ్లీ సీఎం కాగానే నా మొట్టమొదటి సంతకం దానిపైనే- ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు

Cm Jagan Fires On Chandrababu

CM Jagan : ఏపీలో మరోసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని సీఎం జగన్ జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాగానే తన తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుందన్నారు జగన్. నాయుడుపేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన పాలనతో ఒక్క హామీ అయినా నేరవేర్చారా అని సీఎం జగన్ నిలదీశారు. మన ప్రభుత్వంలో అవ్వా తాతల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే వాళ్లమని, అది తట్టుకోలేకపోయిన చంద్రబాబు తన మనుషులతో అడ్డుకున్నారని సీఎం జగన్ ఆరోపించారు. కుటిల కూటమిని తరిమికొట్టేందుకు అందరూ సిద్ధమయ్యారని జగన్ అన్నారు.

మంచిని అడ్డుకుంటున్న దుష్టచతుష్టయంపై యుద్ధానికి సిద్ధం అని ప్రకటించారు. మీరు వేసే ప్రతీ ఓటు మీ తలరాతను మార్చే ఓటు అని జగన్ అన్నారు. ఇవి మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని చెప్పారు. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతున్న సంఘర్షణ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు.

”కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే చేస్తాను. మళ్లీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్లీ సేవలు అందించే కార్యక్రమం ప్రారంభిస్తాను. ఇదే చంద్రబాబును అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు మీ హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదా. పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సర్టిఫికెట్ కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే కానీ వివక్ష లేనిదే కానీ, ఏ ఒక్క పేదవాడికి అప్పట్లో అందే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు జన్మభూమి కమిటీలు ఏ మాదిరి పని చేశాయో అందరికీ తెలుసు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ ను అభిమానించే ఈ సైన్యం ఎలా పని చేస్తోంది అంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంది” అని సీఎం జగన్ అన్నారు.

Also Read : సమ ఉజ్జీల సమరంలో గెలుపెవరిది? గన్నవరంలో టీడీపీ, వైసీపీ హోరాహోరీ పోరు