గెలుపు గుర్రాల వేట.. పెండింగ్ స్థానాలపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కసరత్తు

బీజేపీ కూడా పలు అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వారి ఎంపిక విషయంలో అధిష్టానం కసరత్తు చేస్తోంది.

గెలుపు గుర్రాల వేట.. పెండింగ్ స్థానాలపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కసరత్తు

AP Elections 2024

AP Elections 2024 : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకటించిన సీట్లకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు కూటమికి తలనొప్పిగా మారింది. ఇంకా టీడీపీలో 7 అసెంబ్లీ స్థానాలకు, 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. విజయనగరం ఎంపీ సీటును తూర్పు కాపు సామాజికవర్గానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సీటు విషయంలో రేసులో కళా వెంకట్రావు, గేదెల శ్రీను, బంగార్రాజు ఉన్నారు.

మరోవైపు విజయనగరం పార్లమెంటు సీటును రఘురామకృష్ణరాజు ఆశిస్తున్నారు. అనంతపురం ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేసినట్లుగా సమాచారం. అయితే, అనంతపురం ఎంపీ స్థానం ఇవ్వాల్సిందేనని జేసీ పవన్ కుమార్ పట్టుబడుతున్నారు. ఇక మరోవైపు జనసేన మరో మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఓ స్థానంలో ఎంపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. వీరి ఎంపికపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు.

అటు బీజేపీ కూడా పలు అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వారి ఎంపిక విషయంలో అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే అసెంబ్లీ స్థానాలను పలువురు ఆశిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ నెలకొనడంతో వారి ఎంపిక విషయంలో బీజేపీ జాగ్రత్త వహిస్తోంది.

టీడీపీ పెండింగ్ స్థానాలు – టికెట్ ఆశావహులు
గుంతకల్లు – జయరాం/జితేంద్ర గౌడ్
అనంతపురం – ప్రభాకర్ చౌదరి/నిర్మల
రాజంపేట – జగన్మోహన్ రాజు/ చెంగల్ రాయుడు
ఆలూరు – వీరభద్ర గౌడ్/ వైకుంఠం కుటుంబసభ్యులు
చీపురుపల్లి – గంటా శ్రీనివాసరావు/కిమిడి నాగార్జున
భీమిలి – కళా వెంకటరావు/బంగార్రాజు
దర్శి – సిద్ధా కుటుంబసభ్యులు

బీజేపీ పెండింగ్ స్థానాలు – టికెట్ ఆశావహులు
ఎచ్చెర్ల – నడికుదిటి ఈశ్వర్ రావు
విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి/అడ్డూరి శ్రీరామ్
బద్వేల్ – పనతల సురేశ్
ఆదోని – పార్థసారథి
ధర్మవరం – వరదాపురం సూరి/సత్యకుమార్
జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
కైకలూరు – కామినేని శ్రీనివాస్/ తపనా చౌదరి
వైజాగ్ నార్త్ – విష్ణుకుమార్ రాజు
అనపర్తి – అభ్యర్థి విషయంలో కొనసాగుతున్న కసరత్తు

 

Also Read : ఏపీ బీజేపీలో సీట్ల లొల్లి.. ఢిల్లీ బాటపట్టిన సీనియర్లు