Today Horoscope : నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అధికవ్యయం, మానసిక ఆందోళనలు.. జాగ్రత్తలు అవసరం..

ఈ రోజు (2024, నవంబరు 28, గురువారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope : నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అధికవ్యయం, మానసిక ఆందోళనలు.. జాగ్రత్తలు అవసరం..

Today Horoscope

Updated On : November 27, 2024 / 9:17 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు : శ్రీ క్రోధి నామ సంవత్సర బహుళ ద్వాదశి: ఉ 6:23, చిత్త : ఉ 7:36 గురువారము

మేషం : బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తించాలి, అధికవ్యయం తగ్గించుకోవాలి. మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి. అనవసరపు విషయముల మీద జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేయడం. ఇండ్లు కొనుగోలు విషయాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృషభం : కొన్ని చికాకులు కలగడం, అనుకున్నవి కుదరకపోవడం, ఋణ బాధలు పెరగడం విదేశాలకు వెళ్లడం, ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతన వ్యాపారాల్లో లాభములు, విలువైన ఆభరణములు కొనడం, దూరప్రయాణములు చేయడం, ధనం విషయంలో పొదుపు పాటించాలి. ఆరోగ్యము పట్ల శ్రద్ద అవసరము. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. తీర్థ యాత్రలు, పుణ్యక్షేత్రములు దర్శనము కలుగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

మిధునం : ధనవ్యయం, కోపము, ఆవేశము పెరగడం, తోందరపాటు నిర్ణయములు, బంధు మిత్రులతో అనుభంధం పెరగడం, ప్రయాణములలో నష్టము, సంతానము ద్వారా శుభవార్తలు, ఆదాయం పెరగడం, నూతన వస్త్రములు కొనడం, ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును

కర్కాటకం : అన్నింటా విజయం, విద్యార్థులకు అనుకూలము, ధనలాభము, ప్రమాదములు, గొడవలు రాకుండా కాపాడుకోవాలి. విలువైన ఆభరణములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకులము, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి

సింహ : అనుకోని ప్రయాణములు, ధననష్టము వృధా భ్రమణం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నములు సఫలీకృతం కావడం, నూతన ఉద్యోగములు, నూతన వ్యాపారములు, మంచి ఆలోచనలు, గణపతి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది.

కన్యా : ఉద్యోగ భద్రత అవసరము. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అనవసరపు విషయముల వైపు వెళ్లకూడదు. వ్యాపారంలో మార్పులు, విదేశాలకు వెళ్లడం. స్త్రీ సుఖం, నూతన ఆలోచనలు. ప్రతి పనిలో విజయం సాధించడం. జీవితంలో మార్పులు చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు రావడం, కోర్టు సమస్యలు, పిత్రార్జితము కలసి రావడం. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

తుల : అనుకోని సమస్యలు, సరియైన సమయంలో సరియైన నిర్ణయము తీసుకోలేకపోవడం. వ్యాపారంలో ఇబ్బందులు, నూతన గృహనిర్మాణము, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, కోర్టు సమస్యలు రావడం, ప్రయాణాల్లో నష్టము, భాగస్వామ్యంలో తగాదలు, భార్యభర్తల మధ్య విరోద భావములు, విద్యార్థులకు అనుకూలము. దత్తాత్రేయ స్తోత్రపారాయణం చేయడం వల్ల శుభం ఫలితములు కలుగుతాయి.

వృచ్చికం : సమస్యలు ఉత్పన్నం అవడం, అధికారులతో చిక్కులు, ఆవేశం, కోపం ఎక్కువ కావడం, అనాలోచిత నిర్ణయములు. పిత్రార్జిత విషయంలో తగదాలు, గోడవలు, కోర్టు సమస్యలు, సరియైన నిర్ణయమలు తీసుకోలేకపోవడం. అభిప్రాయ బేదములు, అధికవ్యయం, ఉన్నత చదువుల గురించి ధనము ఖర్చు కావడము, సంతోషము, స్త్రీ సుఖము కలగడం, అనవసరపు విషయములలో తల దూర్చకూడదు. ఆంజేనేయ స్వామి ఆరాధన వలన శుభఫలితములు కలుగుతాయి.

ధనస్సు : ఆదాయం పెరగడం, నూతన వ్యాపారంలో ఆదాయం పెరగడం, వివాహాది శుభకార్యక్రమములలో పాల్గోనడం, సంతానము ద్వారా శుభవార్తలు. విదేశాలకు వెళ్లే అవకాశములు రావడము. ప్రయాణాల్లో ప్రముఖ వ్యక్తులతో పరిచయములు పెరగడం. విలువైన ఆభరణములు కొనడము, దుస్తులు, వాహనములు కావడం, బందుమిత్రులతో సహనంగా ప్రవర్తించాలి. గురుచరిత్ర పారాయణం చేసినచో ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

మకరం : ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారంలో చికాకులు, ప్రయాణంలో ఆటంకములు, ఆకస్మిక ధనలాభము, ఋణ బాధలు తగ్గటం, బ్యాంకు లోన్లు రావడం, శుభకార్యనిర్వాహణ, తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన, వాహన సౌఖ్యం, ప్రతి పనిలో విజయం సాధించడం, విలువైన వస్తువులు కొనడం, గృహమరమ్మత్తులు, భూసంబధ వ్యవహారములలో అనుకూలము, ఒప్పందాలు కుదుర్చుకోవడము. అగ్రిమెంట్లు ఒప్పందాలు, అమ్మ వారి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

కుంభ : మనఃశాంతి లేకపోవడం, ఋణ బాధలు ప్రముణములో ఆటంకములు, తీర్థయాత్రలు, ధనం విషయములో జాగ్రత్తలు అవసరము, నిరాశ, కోర్టు తీర్పులు వాయిదా, గర్భిణులకు శుభవార్తలు స్థానచలనము, బదిలీలు, ప్రమోషన్లలలో ఆలస్యంగా అనుకులత, వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితములు, శుభకార్యచర్చలు వాయిదా. నాగదేవత ఆరాధ్య వలన సమస్యలు తొలగిపోతాయి.

మీనం: నూతన ఆలోచనలు, వృత్తి ఉద్యోగము. చికాకులు, పనులలో ఆలస్యము, దైవకార్యములు, లేనిపోని అపోహలు. భాగస్వామ్య వ్యాపారములు కలసి రావడం, ఉన్నత చదువులు, దూరప్రయాణములు, వివాహములలో పాల్గోనటం. స్థలములు కొనుగోలు చేయడం, అనారోగ్య కారణంగా అధికవ్యయం, అభివృది పదంలో ముందుకు వెళ్ళడం. నూతన ఆలోచనల ద్వారా ధనము సంపాదించడం. గణపతి దేవాలయ దర్శనము చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956